హైదరాబాద్ పోలీస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు
TeluguStop.com
హైదరాబాద్ పోలీస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.అసెంబ్లీ ముట్టడిలో తనను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
41 ఏ నోటీస్ ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని బల్మూరి వెంకట్ పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ క్రమంలో పోలీస్ అధికారులపై ధర్మాసనం చర్యలు తీసుకోవాలని పిల్ లో కోరారు.
బల్మూరి పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం సీపీ సివి ఆనంద్, సైఫాబాద్ ఏసీపీతో పాటు ఇన్స్పెక్టర్ కు నోటీసులు జారీ చేసింది.
అదేవిధంగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు ఇచ్చింది.అనంతరం తదుపరి విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది.
తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్.. సినీ ఇండస్ట్రీలో నయా సెంటిమెంట్!