హీరో నవదీప్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట..!
TeluguStop.com
హైదరాబాద్ లోని మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసులో యాంటీ నార్కోటిక్ బృందం అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగానే హీరో నవదీప్ కు డ్రగ్స్ కేసులోని డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయంటూ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
అయితే ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్న హీరో నవదీప్ తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే నవదీప్ ను అరెస్ట్ చేయవద్దంటూ పోలీసులకు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసిందని సమాచారం.
కాగా డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మరి కొంత మంది సినీ ప్రముఖులు ఇతరులు పరారీలో ఉన్నారని తెలిపారు.
ఫుట్‌బాల్ మ్యాచ్ లో రెఫరీ నిర్ణయంపై ఘర్షణ.. 100 మంది మృతి