T-SAVE నిరాహార దీక్షకు తెలంగాణ హైకోర్టు అనుమతి
TeluguStop.com
హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద T-SAVE నిరాహార దీక్షకు తెలంగాణ హైకోర్టు అనుమతిని ఇచ్చింది.
వైఎస్ఆర్ టీపీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద T-SAVE నిరాహార దీక్ష నిర్వహించాలని అఖిలపక్షం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
దీక్షకు అనుమతి కావాలంటూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారించింది.ఈ క్రమంలో షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది న్యాయస్థానం.
దీక్ష చేసే 48 గంటల ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోర్టు తెలిపింది.
అదేవిధంగా ఐదు వందల మంది కంటే జనసమీకరణ మించకూడదని సూచించింది.
రూపాయి ఖర్చు లేకుండా జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టండిలా!