జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ల పై హైకోర్టు ఆగ్రహం.. ?

తెలంగాణలో ఇప్పటికే అవినీతి అందంగా అలంకరించుకుని నేతల ఇళ్లలో తిష్టవేసిందనే ప్రచారం జోరుగా సాగుతుంది.

అదీగాక ఇదివరకు పలుసార్లు తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ అక్షింతలు వేసిందన్న విషయం తెలిసిందే.

ఇక ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జోనల్ కమిషనర్లకు కూడా హైకోర్టు షాక్ ఇచ్చింది.

ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు నగరంలో సాగుతుంటే బొమ్మల్లా చూస్తున్నారు తప్పితే వీటిని అరికట్టే విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

అదీగాక ఎన్నో అక్రమ నిర్మాణాలను క్షేతస్థాయిలో అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారని, ఇలా విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలపాలని జీహెచ్ఎంసీని ప్రశ్నించింది.

ఇకపోతే ఈ అంశం పై తీవ్రంగా స్పందించిన ధర్మాసనం అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో అందజేయాలని బల్దియా పరిధిలోని జోనల్ కమిషనర్లను ఆదేశించింది.

ఒకవేళ స్టే వెకేట్ పిటిషన్లు వేయకపోతే కారణాలు కూడా చెప్పాలని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను ఏప్రిల్ 15న వాయిదా వేసింది.

ఆర్టీసీ కార్గో పార్శిల్ మిస్సింగ్.. టెన్షన్ పడుతున్న అధికారులు.. ఎందుకంటే?