ఈటలకు బల్లెమవుతున్నవి ఆ ఘాటు వ్యాఖ్యలేనా.. ?

తెలంగాణ రాజకీయాలు దొరలపాలనను తలపిస్తున్నాయని ఇప్పటికే ప్రతిపక్షాలు ఎన్నో సార్లు ఆరోపణలు గుప్పించాయి.

కాగా గులాభిబాస్‌కు కాస్త వ్యతిరేకంగా మాట్లాడిన నేతలకు ఉద్వాసన పలకడం అనవాయితీగా పెట్టుకుని రాచకీయం చేస్తున్నారనే అపవాదు ఉండనే ఉంది.

ఇలాంటి టైంలో తెరమీదికి వచ్చిన మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం అవకాశం కోసం చూస్తున్న వారికి బంగారు పళ్ళెంలా మారిందట.

దీంతో ఎప్పటి నుండో ఈటల రాజేందర్ ను రాజకీయాలకు దూరం చేయాలని చూస్తున్న వారికి చేతికి భూ కుంభకోణం అనే అంశం వరంగా మారిందనే ప్రచారం జరుగుతుంది.

ఇకపోతే ఈటల రాజేందర్ ముక్కుసూటిగా వ్యవహరించే లక్షణం వల్ల, అప్పుడప్పుడు పెదవి జారిన మాటలు గులాభి బాసు గుండెల్లో ముల్లులా గుచ్చుకున్నాయని పలుసార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

"""/"/ అంతే కాకుండా మంత్రి పదవి అడుక్కుంటే వచ్చింది కాదు.పార్టీలోకి నేను మధ్యలో వచ్చినోన్ని కాదు.

బతకడానికి వచ్చినోన్ని అసలే కాదు.మేం గులాబీ జెండా ఓనర్లం.

పదవులు అడుక్కొనే వాళ్లం కాదు.అధికారం శాశ్వతం కాదు.

ధర్మం, న్యాయం మాత్రమే శాశ్వతం.దొంగలెవరో, దొరలెవరో త్వరలోనే తేలుతుంది అంటూ 2019, అక్టోబర్​ 29న మంత్రి ఈటల రాజేందర్​ చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం ఈటలకు బల్లెమవుతున్నాయా అనే అనుమానాలకు తావిస్తుందట.

ఇక తెలంగాణ ఉద్యమంలో తూటాల్లాంటి మాటలతో అగ్గిరాజేసిన ఈటెల రాజేందర్ ఇప్పుడు స్వపక్షంలో విపక్షంగా మారారంటున్నారు కొందరు.

ఏది ఏమైన ఈటలను పదవీచ్యుతుడ్ని చేయదానికి పెద్ద కుట్ర జరుగుతుండనే ఆరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి.

బీజేపీతో అనవసరంగా పొత్తు పెట్టుకున్నామా ? తీవ్ర అసంతృప్తితో చంద్రబాబు ?