తెలంగాణ గురుకుల టీజీటీ తుది ఫలితాలు విడుదల

నల్లగొండ జిల్లా:ఎంతో మంది అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో టిజిటి( TGT ) ఉ ద్యోగ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి.

ఆదివారం సాయంత్రం ఈ ఫలితాలను గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్ లో ఉంచింది.

గురుకులాల్లో 4,020 పోస్టులు ట్రైయి న్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, టిజిటి పోస్టులకు గతేడాది ఆగస్టు లో రాతపరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.

ఈ పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపిక చేసింది.

ఈ మేరకు ప్రొవిజినల్ సెలెక్షన్ జాబితా( Provisional Selection List )లను విడుదల చేసింది.

ప్రొవిజినల్ జాబితాలో ఉన్న హాల్‌టికెట్ నంబర్ కలిగిన అభ్యర్థులకు ఫిబ్రవరి 27,28 తేదీల్లో హైదరాబాద్‌( Hyderabad )లో ఈ కింది తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరుకావాలని సూచించింది.

సబ్జెక్టుల వారీగా ఎంపికైన జాబితాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.