రీల్స్ చేయడం మీ హాబీనా? ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే!
TeluguStop.com
ఈ స్మార్ట్ యుగంలో మనుషులు కూడా చాలా స్మార్ట్ స్మార్ట్ గా తయారవుతున్న పరిస్థితి.
ఈ క్రమంలోనే ఇంటికొక కళాకారుడు పుట్టుకొస్తున్నారు.సోషల్ మీడియా( Social Media ) ప్రభావం పెరిగాక ఇలాంటి కళాకారులు వెలుగు చూస్తున్నారు.
రీల్స్( Reels ) చేస్తూ తమ కలలను ఫుల్ ఫీల్ చేసుకోవడమే కాకుండా ఎంతోమంది దానిని ఆదాయమార్గంగా కూడా ఎంచుకుంటున్నారు.
చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు నచ్చిన రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.
అయితే అలాంటి వాళ్ల కోసమే ఇపుడు ప్రభుత్వం ఓ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది.
అవును, దీనికి 18 ఏళ్ల పైబడిన వారంతా అర్హులు.విషయం ఏమంటే, తెలంగాణలో డ్రగ్స్ వాడకం రోజురోజుకూ పెరిగిపోతోంది.
బడి పిల్లల నుంచి 30 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న వాళ్ల చాలా మంది డ్రగ్స్ తీసుకుంటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న పరిస్థితి.
దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం( Telangana Govt ) సిద్ధమైంది.
సరికొత్త విధానంతో అందరిలోనూ అవగాహన కల్పించాలని సంకల్పించింది.ఈ క్రమంలోనే అంతర్జాతీయ డ్రగ్ అండ్ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జూన్ 26వ తేదీన షార్ట్ వీడియో కాంటెస్ట్ నిర్వహించాలని నిర్ణయించింది.
"""/" /
దానికోసం అద్భుతమైన సందేశాల్ని ప్రజలకు చేరువ చేయాలనుకుంటోంది.డ్రగ్స్ అండ్ ఇట్స్ ఎడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ సౌసైటీ పేరుతో పోలీస్ శాఖ ఈ కాంటెస్ట్ నిర్వహించనుంది.
దీనికి 18 ఏళ్ల నిండిన వారంతా ఈ పోటీలకు అర్హులని తెలంగాణ సర్కారు ప్రకటించింది.
దీనికి మీరు చేయవలసిందల్లా ఆ సబ్జెక్టు ని బట్టి ప్రజల్లో అవగాహనా కలిగేలా రీల్స్ చేయడమే.
డ్రగ్స్ కు బానిసలైన కుటుంబ సభ్యుల బాధలను వివరించడమే ప్రధాన ఉద్దేశ్యం. """/" /
వీడియోను 1 నిముషం నుండి 3 నిమిషాల నిడివితో రూపొందించి ఈ వీడియోలను జూన్ 20లోపు పంపాల్సి ఉంటుంది.
ఈ పోటీలో విజేతలకు బహుమతులు అందజేస్తారు.మొదటి స్థానంలో నిలిచిన విజేతకు రూ.
75 వేలు, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.50 వేల, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.
30 వేలు ఫ్రైజ్ మనీ ఉంటుంది.ఈ పోటీలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న వాళ్లు మరింత సమాచారం కోసం నిర్వాహకులను 9652394751 నంబర్ ద్వారా సంప్రదించాలని సూచించారు.
చిక్కుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు.. నోటీసులు జారీ చేసిన ఈడీ