ప్రధాని మోడీ తో భేటీ అయిన తెలంగాణ గవర్నర్ తమిళ సై..!!

ఉగాది వేడుకల సమయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యవహరించిన తీరు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

మేటర్ లోకి వెళ్తే రాజ్ భవన్ లో జరిగిన ఉగాది వేడుకలకు.సీఎం కేసీఆర్ సహా మంత్రులు ఎవరూ హాజరు కాలేదు.

ఇటువంటి తరుణంలో ప్రధాని మోడీ తో భేటీ అవడానికి తమిళసై నిన్న ఢిల్లీ చేరుకోవడం జరిగింది.

అయితే నేడు తాజాగా మోడీతో భేటీ అయిన ఆమె .భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడానికి ప్రధాన మంత్రిని కలవ లేదు అని పేర్కొన్నారు.కోవిడ్ వ్యాక్సినేషన్ సమర్థవంతంగా జరిగినందుకు మోడీ కి కృతజ్ఞతలు తెలిపినట్లు స్పష్టం చేశారు.

అదేవిధంగా పుదుచ్చేరి హైదరాబాద్ మధ్య నేరుగా విమాన సర్వీసులు నడపాలని కోరినట్లు కూడా తెలిపారు.

మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు మరింతగా పెంచాలని ప్రధానిని కోరడం జరిగిందని తమిళసై విజ్ఞప్తి చేశారు.

రాజ్యాంగ వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని.వ్యక్తిగా కాకుండా వ్యవస్థను పరిగణలోకి తీసుకోవాలని తమిళ సై సంచలన వ్యాఖ్యలు చేశారు.

కనీసం తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వటం లేదని అన్నారు.

ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత చీఫ్ సెక్రటరీకి ఉందని పేర్కొన్నారు.ఇంకా అనేక విషయాలు తమిళసై మీడియా ముందు మాట్లాడి.

రాజకీయంగా సంచలనం రేపారు.

యూపీఐ యాప్‌ల ద్వారా పొరపాటున డబ్బు వేరొకరికి పంపారా? ఇలా చేస్తే డబ్బు తిరిగి పొందవచ్చు!