తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..ప్రజల కోసం కొత్త వాట్సాప్ చానల్?

తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ప్రభుత్వ పథకాల సమాచారం, సేవల వివరాలను సామాన్య ప్రజలకు నేరుగా అందించాలన్న లక్ష్యంతో వాట్సాప్ చానల్ ను ఏర్పాటు చేసింది.

‘తెలంగాణ సీఎంవో’ పేరిట వాట్సాప్ ఛానల్ ను ఏర్పాటు చేసింది రాష్ట్ర సర్కార్.

దీని ద్వారా సీఎం కేసీఆర్ వార్తలు ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని తెలుస్తోంది.కాగా దీన్ని సీఎం పీఆర్వో సమన్వయంతో ఐటీ శాఖకు చెందిన డిజిటల్ మీడియా విభాగం నిర్వహిస్తుంది.

అయితే ఈ ఛానల్ లో జాయిన్ కావాలంటే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాల్సి ఉంటుంది.

చైనాలో విజయ్ సేతుపతి మూవీ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే అన్ని రూ.కోట్లా?