ఏడాది తర్వాత కళ్ళు తెరిచిన తెలంగాణ సర్కార్..

తెలంగాణ సర్కార్ ఎంతో అట్టహాసంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ తో లక్షలాది రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.

ధరణి పోర్టల్ తో ఇకపై ఎలాంటి సమస్యలు ఉండవని ప్రభుత్వం నమ్మ బలికింది.

అయితే పోర్టల్ నిండా సమస్యలే.దీని వల్ల రాష్ట్రంలోని ఏ రైతు సంతోషంగా లేడు.

ప్రతి రైతు ఏదో ఒక సమస్య ఎదుర్కొంటున్నాడు.అవసరానికి భూములు అమ్ముకోలేని వారు ఎందరో రెవిన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

లోపాలు సవరించడానికి పోర్టల్ లో ఆప్షన్లు లేక కలెక్టర్లు కూడా ఏమీ చేయలేకపోతున్నారు.

ఏడాది తర్వాత నింపాదిగా కళ్ళు తెరిచిన ప్రభుత్వం మంత్రి హరీష్ రావుతో మంత్రుల కమిటీ వేసింది.

ధరణి పోర్టల్ సమస్యల మీద చర్చించిన కమిటీ మొత్తం 20 వరకు సమస్యలున్నట్లుగా గుర్తించింది.

సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నియోజకవర్గం గజ్వేల్ లోని ములుగు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసింది.

ఈ ఒక్క గ్రామం నుంచే 272 సమస్యల పరిష్కారం కోసం అర్జీలు వచ్చాయి.

వాటిలో 132 సమస్యలను కలెక్టర్ కూడా పరిష్కరించలేనివే ఉన్నాయి.దీంతో కలెక్టర్ కూడా చేతులెత్తేసారు.

రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల వరకు అర్జీలు రావచ్చని భావిస్తున్నారు.ఏ సమస్యా లేని భూములు కూడా ధరణిలో నిషేధిత జాబితాలో చేరాయి.

ఒకే పేరుతో ఇద్దరు రైతులుంటే వారి భూములు తారు మారయ్యాయి.సర్వే నెంబర్లు మారాయి.

పట్టా భూముల్నిప్రభుత్వ భూములుగా మార్చేశారు.ఆధార్ నెంబర్లలో తప్పులు దొర్లాయి.

ఇలా ప్రభుత్వం చేసిన తప్పులకు రైతులు నానా తిప్పలు పడుతున్నారు.రెవిన్యూ ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతూనే ఉన్నారు.

"""/"/ ధరణి వెబ్ సైట్ లోపాల పుట్టగా మారింది.రెవిన్యూ ఆఫీసుల చుట్టూ రైతులు తిరుగుతున్నారు.

ధరణిలో తమ భూములు కనిపించక గగ్గోలు.ఏడాది తర్వాత సర్కార్ కళ్ళు తెరిచింది.

మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారు.భూ సమస్యల పరిష్కారం కోసం పైలట్ ప్రాజెక్టు.

గజ్వేల్ సెగ్మెంట్ లోని ములుగు గ్రామం ఎంపిక చేశారు.ఈ గ్రామం నుంచే సమస్యల పరిష్కారం కోసం 272 అర్జీలు.

రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షలకు పైగా అర్జీలు వచ్చే అవకాశం ఉంది. """/"/ 20కి పైగా సమస్యలను కమిటీ గుర్తించింది.

పట్టా భూములు ప్రభుత్వ భూములుగా.సర్వే నంబర్ల తారుమారు అయ్యాయి.

సర్టిఫికెట్లలో తప్పులు.ఏ సమస్యా లేకపోయినా నిషేధిత జాబితాలోఒకే పేరున్న ఇద్దరు వ్యక్తుల భూముల తారుమారు చేశారు.

ఆధార్ నంబర్లలో తప్పులు, నెలల తరబడి తిరిగినా సమస్యలు పరిష్కారం కావడం లేదు.

సవరించడానికి పోర్టల్ లో కనిపించని ఆప్షన్లు కలెక్టర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి.

దిక్కు తోచని స్థితిలో అన్నదాతలు ఉన్నారు.

హీరో నానికి ప్యాన్ ఇండియా స్టార్ అయ్యే సత్తా ఉన్నట్టేనా ?