కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. !

ఈ మధ్య కాలంలో తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో నెలకొన్న పరిస్దితుల పట్ల ఎక్కువగా శ్రద్ధ వహిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.

దీనికి కారణం కూడా అందరికి తెలిసందేనట.తెలంగాణ ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న నమ్మకం ఎక్కడ సన్నగిల్లుతుందో అనే అనుమానంతో అన్నీ తానై గులాభి బాధ్యతలను మోస్తున్నారని అంటున్నారు.

అదీగాక కోర్టు కూడా ప్రభుత్వ పాలన పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడం ఇందుకు కారణం కావచ్చూ.

ఇకపోతే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్దితుల పై చర్చించడానికి కేబినెట్ భేటీకి ముహూర్తం ఖ‌రారైంది.

ఈ క్రమంలో మంగళ వారం మధ్యాహ్నం 2 గంట‌ల‌కు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుందని సమాచారం.

కాగా ఈ సమావేశంలో లాక్‌డౌన్ ఎత్తివేయాలా లేదా పొడిగించాలా అనే అంశంలతో పాటుగా, క‌రోనా మూడోద‌శ, వైద్యం, నీటిపారుదల ప్రాజెక్టుల పనుల పురోగతి, రైతుబంధు, వ్యవసాయ పనులు, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు చేపట్టిన చర్యలు, ఆర్థిక పరిస్థితి మొదలగు తదితర అంశాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారట.

కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఇండియన్ నటి సరికొత్త రికార్డ్