తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 3124 పోస్టులకు గ్రీన్ సిగ్నల్..!!
TeluguStop.com
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం( Telangana Government ) వరుసగా నోటిఫికేషన్ లు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
గత ఏడాది బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలలో సీఎం కేసీఆర్( CM KCR ) లక్ష ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు హామీ ఇచ్చారు.
ఆ రీతిగానే ప్రభుత్వ రంగాలలో ఖాళీగా ఉన్న స్థానాలకు సంబంధించి భర్తీ చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉంది.
దాదాపు ఏడాది నుండి ఇప్పటివరకు చాలా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. """/" /
ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ వైద్య విధాన పరిషత్( Telangana Vaidya Vidhana Parishad ) పరిధిలోని ఆసుపత్రులలో 3124 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేయడం జరిగింది.
ఈ క్రమంలో 2029 అవుట్ సోర్సింగ్, 968 పోస్టులను కాంట్రాక్ట్, 127 పోస్టులను ఎంటిఎస్ పద్ధతిలో భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమయింది.
సెక్యూరిటీ గార్డు నుంచి సివిల్ అసిస్టెంట్ సర్జన్ వరకు పలు విభాగాల పోస్టులను ఏడాది కాల పరిమితితో నియమించనున్నారు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరుస పెట్టి నోటిఫికేషన్ లు( Govt Job Notification ) విడుదల చేస్తూ ఉండటంతో.
నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అమెరికా: ఇంటి భోజనం కోసం పరితపించే భారతీయులకు గుడ్‌న్యూస్.. న్యూయార్క్‌లో అద్భుతమైన సర్వీస్!