తెలంగాణలో ధాన్యం కొనుగోలుగా 3732 కేంద్రాలు ఏర్పాటు!

వేసవి సీజన్ వచ్చేసింది.ఇక రైతులు తాము పండించిన ధాన్యం అమ్మకానికి సిద్ధం అవుతూ ఉంటారు.

అయితే ఇలాంటి సమయంలో దళారులు రైతులని దోచుకోవడానికి రెడీ అవుతారు.రైతుల దగ్గరకి నేరుగా వెళ్లి పంటలని కొనుగోలు చేయడానికి రెడీ అవుతారు.

వీరి వలన రైతులు భారీగా నష్టపోయే పరిస్థితి వస్తుంది.అయితే ఇప్పుడు అలాంటి సమస్యలు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది.

రైతుల దగ్గర నుంచి పంటని నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధం అవుతుంది.

ఇందులో భాగంగా రైతులు ధ్యానం నిల్వలని అమ్ముకోవడానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలో సుమారు 3732 కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేసింది.

దాన్యం అమ్మకానికి వచ్చే రైతులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్ళు నిర్వహించాలని కలెక్టర్స్ కి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

అలాగే మిల్లర్లు రైతులని ఇబ్బంది పెట్టకుండా చూడాలని కూడా సూచించింది.

మళ్లీ జనంలోకి ఏపీ సీఎం జగన్..!