అమెరికాలో హాట్ టాపిక్ గా మారిన తెలంగాణ బిడ్డ...

అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో తెలంగాణా బిడ్డ పేరు మారుమోగిపోతోంది.10ఏళ్ళ వయసులోనే కవిత్వాలు రాస్తూ ఏకంగా తన కవితలతో కూడిన పుస్తకాన్నే విడుదల చేసింది.

ఈ కవితలు బాగా పాపులర్ అవ్వడంతో ఎవరా అమ్మాయి అంటూ శోధించిన వారికి మైండ్ బ్లాక్ అయ్యిందట.

కేవలం 10ఏళ్ళ వయసులోనే ఈ స్థాయిలో కవితలు రాస్తూ పుస్తకాన్ని విడుదల చేసిన ఆమె ప్రతిభకు అమెరికన్స్ ఫిదా అవుతున్నారు.

వివరాలలోకి వెళ్తే.అమెరికాలో కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉందో అందరికి తెలిసిందే.

దాదాపు అన్ని కార్యకలాపాలు మూత బడ్డాయి, స్కూల్స్, కాలేజీలు , ప్రతీ విద్యాసంస్థలు మూసివేయబడ్డాయి.

దాంతో పిల్లలకు ఇళ్ళ నుంచే ఆన్లైన్ లో పాటాలు చెప్పడంతో చాలా సమయం పిల్లలకు కలిసి వచ్చింది.

కొందరు ఆట, పాటలతో సమయాన్ని ఎంజాయ్ చేస్తే ఆ సమయాన్ని కొందరు పిల్లలు తమ ప్రతిభను సానబెట్టుకున్నారు.

ఈ వరుసలోనే తెలంగాణకు చెందిన ఓరుగంటి తన్వి నిలిచింది.తెలంగాణలోని కరీంనగర్ కు చెందిన తన్వి రెడ్డి తల్లి తండ్రులు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా స్థిరపడ్డారు.

అమెరికా మొత్తం లాక్ డౌన్ విధించిన సమయంలో తన్వి రెడ్డి పిల్లలు అందరిలా ఆటపాటలతో మునిగిపోకుండా, తనకు ఎంతో ఇష్టమైన కవితలతో కుస్తీ పడింది.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఓ పుస్తకానికి సరపడిన కవితలు రాసేసింది.

వెంటనే వాటన్నిటిని కూర్చి “ఫ్రమ్ ది ఇన్సైడ్ ది ఇన్నర్ సోల్ ఆఫ్ ఏ యంగ్ పోయేట్"అనే పేరు పెట్టి మార్కెట్ లోకి విడుదల చేసింది.

మార్చి 15 న విడుదల అయిన ఈ పుస్తకానికి భారీ స్పందన రావడంతో చుట్టుపక్కల ప్రాంతాలలో తన్వి రెడ్డి పేరు మారుమోగుతోంది.

అంతేకాదు భవిష్యత్తులో మరో పుస్తకాన్ని విడుదల చేయనున్నట్టు తెలిపింది.అమెరికా, భారత్ లో పిల్లలు ఎదుర్కునే సమస్యలపై పుస్తకాన్ని రాయనున్నానని తన్వి రెడ్డి తెలిపింది.

నెల రోజుల్లో స్ట్రెచ్ మార్క్స్ ను మాయం చేసే న్యాచురల్ క్రీమ్ ఇది.. తప్పక ట్రై చేయండి!