కేసిఆర్ ఎట్టకేలకు ఉద్యోగులకు ఇవ్వబోతున్నాడు
TeluguStop.com
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇప్పుడు ఎక్కడ చూసిన పీఆర్సీపై చర్చిచుకుంటున్నారు, ఈ నెలాఖరుతో పీఆర్సీ గడువు ముగియనున్నది.
కావున ఎట్టి పరిస్థితిలో పీఆర్సీ గడువు తేదీని పెంచరాదని ఉద్యోగ ఉపాధ్యాయలు తమ సంఘాలపై ఒత్తిడి తెస్తున్నారు.
తెలంగాణ సిఎం కేసిఆర్ వేతన సవరణ అనుకూలంగా ఉన్నారా లేదా అనే విషయంపై టిఎన్‌జిఓ సంఘం అధ్యక్షుడు, ప్రతినిదులు కలిసి ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి సోమేష్ కుమార్ ని కలుసుకున్నారు.
ఈ విషయంపై సోమేష్ కుమార్ బదులు ఇస్తూ కేసిఆర్ వేతన సవరణకు అనుకూలంగా ఉన్నట్లు తెలిపాడు.
అందుకు వేతన సవరణ నుండి నివేధికను తెప్పించుకునే అవకాశం ఉన్నదని సోమేష్ కుమార్ టిఎన్‌జిఓ అధికార ప్రతినిదులకు చెప్పారు రాష్ట్ర ఆర్దిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న ఎంతో కొంత ఫిట్మెంట్ పై నిర్ణయం తీసుకోవాలని కేసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
త్వరలో ప్రభుత్వ అధికారుల నుండి నివేదికను తెప్పించుకుని అదే రోజు ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల తో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.
సినిమా హిట్ అవ్వాలంటే ఆమె పాత్రని చంపేయాలి.. వివాదాస్పదమవుతున్న రానా, తేజ సజ్జా కామెంట్స్!