Kishan Reddy : తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం లేదు..: కిషన్ రెడ్డి
TeluguStop.com
ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi )తోనే దేశ భద్రత అని బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు.
ప్రజలు మళ్లీ మోదీ పాలననే కోరుకుంటున్నారని తెలిపారు.మోదీ తొమ్మిదేళ పాలన నీతివంతంగా సాగిందన్న కిషన్ రెడ్డి( Kishan Reddy ) తీవ్రవాదం, ఉగ్రవాదం తగ్గి ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని చెప్పారు.
"""/" /
పేద ప్రజలకు బీజేపీ( BJP )తోనే మేలు జరిగిందన్నారు.పెద్దపల్లితో పాటు 370 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని తెలిపారు.
తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం లేదని పేర్కొన్నారు.బీఆర్ఎస్, కాంగ్రెస్( BRS, Congress ) కు ఓటు వేస్తే వృథా అవుతుందని తెలిపారు.
తెలంగాణలో 17 స్థానాలు బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.