నేడు తెలంగాణ డీజీపీ పదవీ విరమణ..!
TeluguStop.com
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఇవాళ పదవీ విరమణ చేయనున్నారు.ఈ మేరకు తెలంగాణ పోలీస్ అకాడమీలో మహేందర్ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఇంఛార్జ్ డీజీపీగా నియామకమైన సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ మాట్లాడుతూ మహేందర్ రెడ్డితో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.
ఇలాంటి అధికారులు అరుదుగా ఉంటారన్న ఆయన మహేందర్ రెడ్డి తనకు ఆదర్శమని తెలిపారు.
సాంకేతికతను పోలీస్ శాఖకు జోడించడంలో మహేందర్ రెడ్డి చొరవ అభినందనీయమని పేర్కొన్నారు.ప్రభుత్వం పోలీస్ శాఖకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు దేశానికే ఆదర్శమని వెల్లడించారు.
వైరల్: ఊసరవెల్లులు జిమ్ చేస్తున్నాయి… అవాక్కవ్వాల్సిందే!