సీఈసీకి పంపే లిస్టుపై తెలంగాణ డీజీపీ కసరత్తు

కేంద్ర ఎన్నికల సంఘానికి పంపే లిస్టుపై తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ కసరత్తు చేస్తున్నారు.

హైదరాబాద్ సీపీ రేసులో మహేశ్ భగవత్, షికా గోయల్, శివధర్ రెడ్డి, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో పాటు నాగిరెడ్డి, సజ్జనార్ ఉన్నారు.

కాగా ముగ్గురు పేర్లతో ప్రభుత్వం లిస్టును సీఈసీకి పంపించనుంది.మరోవైపు బదిలీ అయిన ఎస్పీలు, కమిషనర్లు నిన్న రాత్రి 12 గంటలకే రిలీవ్ అయ్యారు.

ఈ క్రమంలోనే ఇంఛార్జ్ లకు బాధ్యతలు అప్పగించారు.అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ విడుదలైన తరువాత పోలీస్ శాఖలో బదిలీల వ్యవహారం సంచలనంగా మారింది.

హైదరాబాద్ సీపీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పలువురు కమిషనర్లు, ఎస్పీలు దాదాపు 13 మందిని బదిలీలు చేస్తూ ఉత్తర్వులు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో వారి స్థానంలో కొత్త లిస్టును పంపాలని సీఈసీ తెలంగాణ సర్కార్ కు ఆదేశాలు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో జాబితాను ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనుంది.

ఏసు భాయిగా రాబోతున్న నటి రష్మిక మందన్న….మరో హిట్ గ్యారెంటీ?