తెలంగాణలో కొత్త కరోనా కేసులు ఎన్నంటే.. ?

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు మాత్రం మెల్లగా నమోదు అవుతున్నాయి.

ఇప్పటికే వ్యాక్సినేషన్ పక్రియ మొదలైనప్పటికి కొందరిలో వ్యాక్సిన్ వేసుకుంటే ఏదైనా జరుగుతుందో అనే భయంలో ఉంటున్నారు.

ఇకపోతే తెలంగాణలో నిన్న రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్దారణ పరీక్షల్లో కొత్తగా 163 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,94,469కి చేరింది.ఇకపోతే నిన్న కరోనాతో ఒకరు మృతి చెందగా ఇప్పటి వరకు మృతుల సంఖ్య 1,599 కి చేరింది.

కరోనా బారి నుంచి నిన్న 276 మంది కోలుకున్నారు.ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,90,630 కి చేరింది.

రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,240 ఉండగా వీరిలో 828 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.

జీహెచ్‌ఎంసీలో కొత్తగా 28 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

వైరల్ వీడియో: నిల్చొని పనిచేయండి అంటూ ఉద్యోగులకు సీఈవో పనిష్మెంట్..