ఈడీ విచారణకు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ఈడీ అధికారులు ఎదుట హాజరైయ్యారు.

ఈ క్రమంలో ఢిల్లీలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా అంజన్ కుమార్ ను ఈడీ విచారించనుంది.యంగ్ ఇండియా లిమిటెడ్ కు ఇచ్చిన విరాళాలపై అంజన్ కుమార్ స్టేట్ మెంట్ ను ఈడీ అధికారులు రికార్డ్ చేయనున్నారు.

పి ఎం ఎల్ ఏ చట్టం సెక్షన్ 50 ఏ ప్రకారం ఆయనను ప్రశ్నించనుంది.

గత నెల 3వ తేదీనే అంజన్ కుమార్ యాదవ్ విచారణకు రావాల్సి ఉండగా.

అనారోగ్యం కారణంగా హాజరు కాలేకపోయారన్న విషయం తెలిసిందే.కాగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఈడీ అధికారులు ప్రశ్నించారు.

పుష్ప విడుదల వేళ సంచలనమైన పోస్ట్ చేసిన అనసూయ… ఆ హీరోని టార్గెట్ చేసిందా?