తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీంకు సైబర్ క్రైం నోటీసులు
TeluguStop.com
తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీమ్ కు సైబర్ క్రైం నోటీసులు అందించింది.
సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా పోస్టులు చేస్తున్నారని కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై తప్పుడు పోస్టులు కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా అధికారులు నోటీసులు అందించారు.
మొత్తం సునీల్ టీంలో ముగ్గురు సభ్యులకు సైబర్ క్రైం పోలీసులు నోటీసులు ఇచ్చారు.
దీంతో ఇషాన్ శర్మ, తాతినేని శశాంక్, మండ ప్రతాప్ లు పోలీసుల విచారణకు హాజరుకావాల్సి ఉంది.
అయితే సునీల్ కనుగోలు హాజరుపై సస్పెన్స్ కొనసాగుతుండగా ఆయన బృందం కూడా విచారణకు హాజరుకాలేదని తెలుస్తోంది.
విచారణకు వచ్చేందుకు మరో పది రోజులు గడువు కావాలని బృందం సభ్యులు కోరారు.
హీరోయిన్ వైష్ణవి చైతన్యను టార్గెట్ చేసి కామెంట్స్ చేశారా.. నిర్మాత ఎస్కేఎన్ క్లారిటీ ఇదే!