తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల

త్వరలో లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) రానున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మ్యానిఫెస్టోను విడుదల చేసింది.

ఈ మేరకు గాంధీభవన్ లో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ రిలీజ్ చేశారు.

ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో మ్యానిఫెస్టోను కాంగ్రెస్ ప్రకటించింది.ఇందులో ప్రధానంగా కాజీపేటలో రైల్వే కోచ్ ఏర్పాటు, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు ఉన్నాయి.

అదేవిధంగా పాలమూరు - రంగారెడ్డి ( Palamuru - Rangareddy )ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా, హైదరాబాద్ లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు మరియు హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి పక్క నుంచి ర్యాపిడ్ రైల్వే వ్యవస్థ వంటి పలు హామీలను కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేర్కొంది.

కాగా ఈ కార్యక్రమంలో మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ , మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు.