రేవంత్ కు వారంతా దూరమే.. పార్టీకి భారమే ?
TeluguStop.com
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కి ఇంకా సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి.
రాజకీయ ప్రత్యర్ధి అయిన బీజేపీ, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా అనేక వ్యూహాలు పన్నుతూ ముందుకు వెళ్తున్నా, సొంత పార్టీలోని నేతలు హ్యాండ్ ఇస్తూ ఉండడం, సొంత పార్టీలోనే నాయకులు ప్రత్యర్థులుగా మారడం ఇవన్నీ ఇబ్బందికరంగా మారాయి.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకాన్ని మొదటి నుంచి కాంగ్రెస్ సీనియర్లు వ్యతిరేకిస్తూ వచ్చారు.
అధిష్టానం కు సైతం వార్నింగ్ ఇచ్చారు.అయినా కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయంలో వెనక్కి తగ్గకపోవడంతో , వారంతా సైలెంట్ గా ఉండిపోయారు.
టిఆర్ఎస్ ప్రకటించిన దళిత బంధు పథకం కి మైలేజ్ రేవంత్ దళిత దండోరా సభను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్లంతా హాజరవుతారని టిఆర్ఎస్ కి గట్టి కౌంటర్లు ఇస్తారు అని అంతా భావించినా, సీనియర్ నాయకులంతా డుమ్మా కొట్టారు.
మొన్నటివరకు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఈ సమావేశానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశం అయ్యింది.
అలాగే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి వంటి వారు హాజరు కాకపోవడం తో పార్టీ సీనియర్లంతా ఇంకా రేవంత్ నాయకత్వంపై ఆగ్రహంగా ఉన్నారని అర్థమవుతోంది.
ఈ పరిస్థితిని మార్చేందుకు రేవంత్ ఎంతగానో ప్రయత్నం చేస్తున్న , సీనియర్ నాయకులు మాత్రం రేవంత్ నాయకత్వంలో ముందుకు వెళ్లేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు అనే విధంగా సంకేతాలు పంపుతున్నారు.
"""/"/
దీంతో రేవంత్ కొత్త సవాల్ ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.తమ రాజకీయ ప్రత్యర్దులయిన టిఆర్ఎస్ బిజెపి లను ఒకవైపు ఎదుర్కొంటునే మరోవైపు సొంత పార్టీలోనే విపక్షంగా ఉన్న నేతలను తన దారికి తెచ్చుకోవడం కత్తిమీద సాములా మారింది.
పార్టీ సీనియర్ల వ్యవహారంపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని లేకపోతే మళ్లీ చేదు ఫలితాలే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే అనే అభిప్రాయం లో రేవంత్ ఉన్నారట.
సీనియర్ల వ్యవహారం పార్టీకి కూడా భారంగా మారింది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
.
రాజకీయ ఎంట్రీ పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్… ఏమన్నారంటే?