శ్రీవారి సేవలో తెలంగాణ కాంగ్రెస్ పార్టి నేత భట్టీ విక్రమార్క..
TeluguStop.com
ఉచిత కరెంట్ అంటేనే గుర్తుకు వచ్చేది కాంగ్రెస్ పార్టియేనని, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్టుగా ప్రజలను భ్రమ కలిగిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టి నేత భట్టీ విక్రమార్క( Bhatti Vikramarka ) ఆరోపించారు.
ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.పీపుల్స్ మార్చ్ ( People's March )పాదయాత్రకు ఎటువంటి అడ్టంకులు లేకుండా స్వామి వారి ఆశీస్సులతో విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందన్నారు.
ఉచిత కరెంటు అనేది కాంగ్రెస్ పార్టి( Congress Party ) పేటెంట్ రైట్ అని, దేశంలో ఎవరూ ఉచిత కరెంటుపై ఆలోచన లేయని రోజుల్లోనే రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఉచితంగా కరెంటు అందజేశారని గుర్తు చేశారు.
ఇరవై నాలుగు లక్షల బోర్లు ఉన్న రైతులకు తెలంగాణలో ఉపయోగపడిందన్నారు.ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టి పేటెంట్ రైట్గా ఉన్నందున, తెలంగాణాలో అధికార పార్టి లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా ప్రజలను భ్రమకు గురి చేస్తుందని ఆరోపించారు.
ఉచిత కరెంట్ అంటేనే గుర్తుకు వచ్చేది కాంగ్రెస్ పార్టి అని, రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని, పేదల సంక్షేమమే కాంగ్రెస్ అజెండాగా పని చేస్తుందన్నారు.
పుష్ప ది రూల్ రీలోడెడ్ లో యాడ్ చేసిన సీన్స్ ఇవే.. ఓటీటీలో సైతం ఉంటాయా?