తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఈడీ పోకస్.. బీజేపీ అసలు లక్ష్యం అదేనా?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో టీఆర్ఎస్‌ నేతలను టార్గెట్ చేసిన ఈడీ  ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలపై  ఫోకస్ పెట్టింది.

నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మాజీ మంత్రి గీతారెడ్డి, మహ్మద్ అలీ షబ్బీర్‌కి నోటిసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులను స్వీకరించడాన్ని మాజీ మంత్రి గీతారెడ్డి, మహ్మద్ అలీ షబ్బీర్ సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఖండించారు.

ఈడీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని మాజీ మంత్రి షబ్బీర్ తెలిపారు.

అయితే తనకు నోటీసు అందితే దానిపై స్పందిస్తానని చెప్పారు.కేంద్ర ఏజెన్సీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని గీతారెడ్డి తెలిపారు.

సికింద్రాబాద్‌ మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ కూడా ఈడీ నోటీసులు అందయనే వార్తలను ఖడించారు.

తెలంగాణకు చెందిన కనీసం ఎనిమిది మంది కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు అందజేసిందని, వారిని ప్రశ్నించేందుకు సమన్లు ​​పంపినట్లు కొన్ని మీడియా కథనాల తెలుస్తుంది.

నేతలు చెక్కుల ద్వారా విరాళాలు ఇచ్చారని, అందులో తప్పు లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్డిని కూడా విచారణకు పిలిచినట్లు సమాచారం.

నేషనల్ హెరాల్డ్ కేసులో ఉన్న కంపెనీల ఖాతాలకు కాంగ్రెస్ నేతలు మొత్తాలను బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి.

ఇది ఇలా ఉండగా వరుసగా తెలంగాణ నేతలపై ఈడీ ఫోకస్ చేయడంపై రాజకీయ విమర్శలు వస్తున్నాయి.

బీజేపీ తెలంగాణలో ఎలాగైన అధికారంలోకి రావాలనే కుట్రలో భాగంగా ఇలా ప్రత్యర్థి రాజకీయ పార్టీలను టార్గెట్ చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.

"""/" / దొపిడి చేసేవారు ఎంత పెద్ద వారైన శిక్షిస్తామంటున్న బీజేపీ అసలు లక్ష్యం అవినీతిపరులు కాదని.

రాజకీయం, అధికార దాహంతోనే నేతలను టార్గెట్ చేస్తూ సీబీఐ, ఈడీ ప్రయోగిస్తుందని ప్రతి పక్షాలు అంటున్నాయి.

ఈడీ ఇప్పటివరకు 5 వేలకుపైగా కేసులు నమోదైతే వారిలో 23 మందికి మాత్రమే శిక్ష పడిందని ఆరోపిస్తున్నాయి.

దాదాపు 99 శాతం కేసులు కేవలం ఆరోపణలు మాత్రమేని విమర్శిస్తున్నారు.నోటీసులు అందుకున్న వారందరిని బీజేపీ అవినీతి ముద్ర వేస్తుందని అంటున్నారు.