అరే ఈ హన్మంతన్న లోల్లెందిర బై ?

ప్రజల్లో పట్టు లేకపోయినా, పార్టీ పెద్దల వద్ద మాత్రం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు హడావుడి ఎక్కువగా ఆ పార్టీ లో కనిపిస్తోంది.

పార్టీ సీనియర్ నేతగా తన కనుసన్నల్లోనే మిగతా నాయకులు అందరూ పని చేయాలి అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్న తీరు మిగతా నేతలకు ఇబ్బందికరంగా మారింది.

తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరును అధిష్టానం సూచిస్తుండడంతో ఆయన ఆగ్రహం మరింతగా కనిపిస్తోంది.

అసలు జూనియర్ నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి పార్టీ బాధ్యతలు ఎలా అప్పగిస్తారని, అదీ కాకుండా ఆయన పై అవినీతి కేసులు ఉన్నాయని, ఆ కేసులో ఆయన జైలుకు వెళితే పార్టీ పరిస్థితి ఏం కావాలి అంటూ హడావుడి చేస్తున్నారు.

ప్రస్తుతం విహెచ్ హడావుడి పైనే కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతోంది.ముఖ్యంగా ఆయన పార్టీ ఇంచార్జీలకు, తెలంగాణ ముఖ్య నేతలకు ఫోన్ కాల్స్ చేస్తూ, తన ఆవేదనను బయట పెడుతుండటం, నిత్యం ఇదే తంతు జరుగుతుండడంతో విహెచ్ నుంచి ఫోన్ కాల్ వస్తుందంటేనే పార్టీ నేతలు హడావుడి పడే పరిస్థితి నెలకొంది.

కేవలం తెలంగాణ నేతలే కాకుండా, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాకూర్, ఏఐసిసి కార్యదర్శి బోస్ రాజు తదితరులకు ఫోన్ చేసి మరీ తన ఆవేదనను బయట పెడుతున్నారట.

అయితే వీహెచ్ చెబుతున్న మాటలకు అడ్డు తగిలి, వారు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుండగానే వారి పైనా తీవ్ర ఆగ్రహం ప్రదర్శించడం వంటి వ్యవహారాలతో మాణిక్యం ఠాకూర్ తో పాటు, బోస్ రాజు తదితరులు వీహెచ్ ఫోన్ కాల్ ను రిసీవ్ చేసుకోవడమే మానేశారట.

"""/"/ బోస్ రాజు అయితే వీహెచ్ ఫోన్ కాల్ సంభాషణ గురించి పార్టీ నేతలు దగ్గర ప్రస్తావించి మరీ ఆవేదన చెందుతున్నారట.

అలాగే అధిష్టానం పెద్దలకు ఈ విషయమై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.వీహెచ్ తన ఆవేదనను కేవలం పరిమిత సమయానికి ముగించకుండా, గంటల కొద్ది ఫోన్ లో చెబుతుండడంతో, పార్టీ ఇంచార్జ్ లు సీనియర్ నాయకులు అసహనానికి గురవుతున్నట్టు తెలుస్తోంది.

రేవంత్ అంశం ప్రస్తావిస్తూ తన ఆవేదనను వెళ్లగక్కుతున్నారట.అసలు తన అంతటి సీనియర్ పార్టీ లో ఉండగా వేరొకరి పేరు ఎందుకు సూచిస్తున్నారు అనే విధంగా వీహెచ్ మాట్లాడుతుండటంతో ఆయన పేరు చెబితేనే హడలిపోయే పరిస్థితి నెలకొందట.

ఆక్రమించుకోవడం ఏంటి.. ఆమేమైనా చిన్నపిల్లనా.. అనసూయ పై రష్మీ కామెంట్స్!