రేవంత్ రెడ్డి రెండేళ్లు మాట్లాడాడంట ! ఎవరితో అంటే..?
TeluguStop.com
తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇప్పడు రాజకీయంగా అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందడంతో.ఆయన అప్పటి నుంచి లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తున్నాడు.
తాజాగా.ఆయన రెండేళ్లపాటు మీడియాతో మాట్లాడనని ప్రకటించారు.
గోల్కొండ హోటల్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతల సమావేశానికి ఆయన హాజరు అయ్యారు.
ఆ సందర్భంగా మీడియా ఆయనను పలకరించింది.కాని ఆయన మాట్లాడడానికి నిరాకరించారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
దీనిపై మీడియా ప్రతినిధులు ప్రశ్ననించగా.తాను రెండేళ్లపాటు మీడియాతో మాట్లాడనని అన్నారట.
ఇన్నాళ్లు మీ కోసం, ఇకపై తనకోసం మానేస్తున్నానని ఆయన చెప్పారని వార్తలు వచ్చాయి.
గత ఎన్నికల సమయంలో ,అంతకు ముందు ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్ర స్థాయిలో పరుష పదజాలం వాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇటువంటి సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు అనేక అనుమానాలు కలుగుతున్నాయి.
‘టీచర్స్’ విస్కీ వెనుక ఇంత మ్యాటర్ ఉందని తెలుసా?