క్యాంప్ రాజకీయాలపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ సైతం పూర్తయ్యాయి.అయితే ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ క్యాంప్ రాజకీయాలపై దృష్టి సారించింది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేసిన సంగతి తెలిసిందే.

దీంతో గెలిచిన వారిని బెంగళూరు క్యాంప్ తరలించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో అక్కడైతే సేఫ్ అని అధిష్టానం యోచనలో ఉందని తెలుస్తోంది.

అయితే ఎమ్మెల్యేలు గెలిచిన తరువాత సీఎల్పీని ఎన్నుకునేందుకు కాస్త సమయం పడుతుంది.ఈ మేరకు విజయం సాధించిన ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది.

ఒక చిన్న ల‌వంగాన్ని ఎన్ని విధాలుగా వాడొచ్చో తెలుసా..?