డీకే కు తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల బాధ్యతలు 

తెలంగాణ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న కాంగ్రెస్ దానికి అనుగుణంగానే వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది.

గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు.ఇప్పటికే పార్టీ రెండో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

  బీఆర్ఎస్,  బీజేపీలను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది.అలాగే పార్టీలో ఇటీవల కాలంలో చేరికలు పెద్ద ఎత్తున చోటు చేసుకోవడం , ప్రజల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే అభిప్రాయాలు నెలకొనడం ఇవన్నీ కలిసి వస్తాయని ఆ పార్టీ అంచనా వేస్తుంది.

ఆయన తెలంగాణలో పూర్తిస్థాయిలో విజయం పై నమ్మకం పెంచే విధంగాను పార్టీ నాయకులను సమన్వయం చేసి ఎన్నికల సమరంలో పై చేయి సాధించే విధంగా చేసేందుకు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్( DK Shivakumar ) కు కాంగ్రెస్ అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించింది.

"""/" /  తెలంగాణ ఎన్నికలు ముగిసే వరకు పూర్తిస్థాయిలో అన్ని వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి డీకే శివకుమార్ కీలకపాత్ర పోషించారు.ఆయనపై నమ్మకంతో కాంగ్రెస్ అధిష్టానం ఉంది.

తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించే విధంగా డీకే శివకుమార్ కు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు బాధ్యతలు అప్పగించారు.

లీడర్లను కోఆర్డినేట్ చేయడం,  పార్టీలో చేరికలు వంటివన్నీ గత కొద్ది రోజుల నుంచి శివకుమార్ ఆధ్వర్యంలోని జరుగుతున్నాయట.

  నెల రోజుల పాటు కర్ణాటక తరహాలో రాజకీయ వ్యవహారాలను రూపొందించి బిఆర్ఎస్ ,బిజెపిలను ఓడించే విధంగా శివకుమార్ కేలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇక కాంగ్రెస్ విజయభేరి యాత్ర ఫేస్ టు నేటి నుంచి ప్రారంభం కానుంది.

దీనికి ముఖ్యఅతిథిగా డీకే శివకుమార్ హాజరు కానున్నారు.రేపు ఆదివారం ఏ ఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే( Mallikarjun Kharge ) హాజరుకానున్నారు.

అలాగే రాహల్, ప్రియాంక గాంధీ కూడా భాగస్వామ్యం కానున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

"""/" /  కాంగ్రెస్( Congress Party ) ప్రకటించిన ఆరు గ్యారెంటీలను జనాలలోకి విస్తృతంగా తీసుకువెళ్లి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు ఎటువంటి మేలు జరుగుతుందో , బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే జరిగే నష్టాలు ఏమిటనేది సవివరంగా వివరించనున్నారు.

దీంతోపాటు ప్రజల నుంచి సలహాలు , సూచనలు తీసుకోనున్నారు.దీనికోసం ప్రతి జిల్లాలో ఒక సజెషన్ బాక్స్ ను ఏర్పాటు చేయడం తో పాటు, టోల్ ఫ్రీ నెంబర్, వెబ్ సైట్ ను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.

సినిమా ఇండస్ట్రీ లో అసలేం జరుగుతుంది…ఎలాంటి కథలు సక్సెస్ అవుతున్నాయి…