పల్లె పల్లె కు కాంగ్రెస్ ! దీనిపైనే నేడు చర్చ ?

తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయం ఆ పార్టీ సీనియర్ నాయకుల నుంచి జూనియర్ నాయకులు వరకు అందరిలోనూ కనిపిస్తోంది.

ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేయడంతో పాటు , ఇటీవల నిర్వహించిన వరంగల్ సభకు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ హాజరైన సందర్భంగా పార్టీ నాయకులకు అనేక అంశాలపై కీలక సూచనలు చేయడంతో వారిలో ఉత్సాహం కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ను క్షేత్రస్థాయి లోకి తీసుకు వెళ్లేందుకు ఆ పార్టీ నాయకులు అంతా డిసైడ్ అయిపోయారు.

ముఖ్యంగా వరంగల్ డిక్లరేషన్ లో తీసుకున్న నిర్ణయాలను  ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

దీనిలో భాగంగానే ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన టి.

పిసిసి విస్తృతస్థాయి సమావేశం జరగబోతోంది.దీనిలో ప్రధానంగా రైతుల డిక్లరేషన్ పై జనాల్లోకి ఏ విధంగా వెళ్లాలి అనే అంశం పైన ప్రధానంగా చర్చించనున్నారు.

ముఖ్యంగా 300 మంది నాయకులతో డిక్లరేషన్ పై జనం లోకి వెళ్లాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

ఒక్కో నాయకుడికి 30 నుంచి 40 గ్రామాల బాధ్యతను అప్పగించబోతున్నట్లు సమాచారం.ఈ కార్యక్రమానికి ' పల్లెపల్లెకు కాంగ్రెస్ ' పేరును ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఒకవైపు పల్లెపల్లెకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే.రెండు భారీ బహిరంగ సభలను నిర్వహించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది.

"""/"/ ఈ సభను ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే విషయంపై ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా చర్చిస్తున్నారు.

పల్లె పల్లె కు కాంగ్రెస్ ను విజయవంతం చేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా డిసైడ్ అయ్యారట.

వరుసగా ఈ తరహా కార్యక్రమాలు చేపడుతూ నే టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, పెరిగిన ధరలు, నిరుద్యోగం వంటి అంశాలను జనాల్లోకి తీసుకెళ్లాలని, అలాగే బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా  ఇప్పుడు సిద్ధం అవుతున్నారు.

పెన్షన్ టెన్షన్ .. ఇప్పుడు వైసీపీలో మొదలయ్యిందా ?