CM Revanth Reddy : ప్రజా సమస్యలపైనే ప్రజా ప్రభుత్వం దృష్టి..: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) నియామక పత్రాలు అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.

గతంలోని బీఆర్ఎస్( BRS ) పాలనలో యువతకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టలేదన్న సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని ఆరోపించారు.

"""/"/ అయితే నియామక పత్రాలు తీసుకున్న సమయంలో ప్రజల సంతోషంలో పాలుపంచుకోవాలనే ఆలోచనతో అందరినీ పిలిపించామని రేవంత్ రెడ్డి తెలిపారు.

గతంలో కేసీఆర్( KCR ) కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయన్నారు.కానీ తెలంగాణలోని నిరుద్యోగులను మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు.

అందుకే కేసీఆర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రజలు ఇంటికి పంపించారని వెల్లడించారు.

వామ్మో, అమ్మాయిలు ఇంత డేంజర్‌గా ఉంటారా.. ప్రియుడికి విషమిచ్చిన ఇంజనీరింగ్ స్టూడెంట్.. చివరకు..?