జిల్లాల పర్యటనలు… ఎన్నికల వ్యూహాలు ! రేవంత్ బిజీ బిజీ
TeluguStop.com
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మరింత బిజీ కాబోతున్నారు.
ప్రస్తుతం వివిధ శాఖల ప్రక్షాళన , కీలక అధికారుల బదిలీలు , మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలపై రేవంత్ ఫోకస్ పెట్టారు .
దీంతోపాటు జిల్లాలో వారీగా పర్యటనలు చేపట్టాలని తాజాగా నిర్ణయించుకున్నారట.కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలను( Six Guarantees Scheme ) అన్నిటిని వంద రోజుల్లోగా అమలు చేసి తమ చిత్త శుద్ది ని నిరూపించుకోవాలనే పట్టుదలతో రేవంత్ ఉన్నారు.
అదీ కాకుండా పార్లమెంట్ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగబోతున్న నేపథ్యంలో , ఆ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ ఎంపి స్థానాలను గెలుచుకోవాలని , అలాగే స్థానిక సంస్థలు ఎన్నికలలోనూ కాంగ్రెస్( Congress Party ) ప్రభావం కనిపించేలా రేవంత్ పావులు కదుపుతున్నారు.
అందుకే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని మరింత బలోపేతం చేసే విధంగాను జనాల్లో కాంగ్రెస్ కు మరింత ఆదరణ పెంచుకుని వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుకునే విధంగా జిల్లాల పర్యటనలు ఉపయోగపడతాయని రేవంత్ భావిస్తున్నారట.
"""/" /
శాసనసభలో స్పీకర్ ఎన్నిక ఈనెల 14న జరిగిన తర్వాత, ఓ వారం రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.
ఆ సమావేశాలు తర్వాత పూర్తిగా జిల్లాల పర్యటనకు కేటాయించాలని రేవంత్ షెడ్యూల్ సిద్ధం చేసుకుంటున్నారట .
అంతకంటే ముందుగా రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్ , ఐపీఎస్, ఇతర కీలక శాఖల అధికారులు బదిలీలు చేపట్టి , అన్ని శాఖల్లోనూ భారీగా ప్రక్షాళన చేపట్టి పూర్తిగా కొత్త టీంను ఏర్పాటు చేసుకుని పాలనలో తనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారట.
దీంతోపాటు డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు( Singareni Elections ) జరగనున్నాయి.
వీటిపైన రేవంత్ దృష్టి సారించారు. సింగరేణి ప్రాంతం లోని పెద్దపల్లి , ఖమ్మం , వరంగల్ లోక్ సభ నియోజకవర్గాలు ఉండడంతో ఎన్నికలను రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
"""/" /
2017 అక్టోబర్ లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలుపొందగా, కొల్ బెల్ట్ ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ యూనియన్ ఎన్నికలలో గెలవాలనే పట్టుదలతో ఉంది .
ఎన్నికల్లో 30948 కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు .అలాగే సింగరేణి పరిధిలోని ఉమ్మడి హైదరాబాద్ , ఖమ్మం, వరంగల్ , కరీంనగర్ జిల్లాలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొమ్మిదిటిని కాంగ్రెస్ గెలుచుకుంది.
కొత్తగూడెం ను కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న సిపిఐ గెలుచుకోగా, బీ ఆర్ ఎస్ అభ్యర్థి కోవలక్ష్మి( Kova Laxmi ) ఆసిఫాబాద్ స్థానంలో గెలుపొందారు.
సింగరేణి ప్రాంతంలోని అసెంబ్లీ సీట్లలో మెజార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థుల గెలవడంతో, సింగరేణి ఎన్నికల్లోను తప్పకుండా తామే గెలుస్తామని ధీమాతో రేవంత్ ఉన్నారు .
అందుకే అవన్నీ కలిసి వచ్చే విధంగా జిల్లాల పర్యటన చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఆ మూవీ కోసం యశ్ పారితోషికం అన్ని వందల కోట్లా.. ఈ విషయంలో రికార్డ్ అంటూ?