ప్లేసు మారే.. కేసిఆర్ తీరు మారే !
TeluguStop.com
తెలంగాణ( Telangana )లో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని కేసిఆర్ ఉవ్విళ్లూరుతున్నారు.రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చిన ఆయన.
మూడో సారి కూడా గెలిచి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా రికార్డ్ సృష్టించాలని పట్టుదలగా ఉన్నారు.
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేసిఆర్ పాలనపై సానుకూలత పాటు కుటుంబ పాలన అనే వ్యతిరేకత కూడా బలంగానే ఉంది.
అంతే కాకుండా గతంతో పోల్చితే కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు కూడా బలం పెంచుకున్నాయి.
దీంతో ఈసారి కేసిఆర్( KCR ) కు అనుకున్న రేంజ్ లో గెలుపు రాదనేది కొందరు చెబుతున్నా మాట.
"""/" / ఈ నేపథ్యంలో గెలుపు కోసం కేసిఆర్ స్ట్రాటజీలు( KCR Political Strategy ) ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తి రేపే ప్రశ్న.
ముఖ్యంగా అభ్యర్థుల విషయంలో ముమ్మర కసరత్తులు చేస్తున్న ఆయన.తాను పోటీ చేస్తే స్థానంపై కూడా భిన్నమైన ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు కేసిఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తూ వచ్చారు.కానీ ఈసారి తాను పోటీ చేసే నియోజిక వర్గాన్ని మార్చే ఆలోచనలో కేసిఆర్ ఉన్నట్లు తెల్సుతోంది.
ఈసారి కామ రెడ్డి( Kamareddy ) నుంచి పోటీ చేసే అవకాశం ఉందని గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ వార్తలకు బలం చేకూరుస్తూ ఇటీవల ఆ నియోజిక వర్గ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
"""/" / కేసిఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ఒకవేళ ఆయన పోటీ చేస్తే తాను కార్యకర్తగా నియోజిక వర్గంలో పని చేస్తానని ఎమ్మెల్యే గంప గోవర్ధన్( MLA Gampa Govardhan ) చెప్పుకొచ్చారు.
దీంతో కేసిఆర్ కామారెడ్డి నుంచి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.ఇక ఇతర అభ్యర్థుల అభ్యర్థుల విషయంలో కూడా కేసిఆర్ మార్పులు చేస్తే అవకాశం ఉందని టాక్.
చాలా నియోజిక వర్గాలలో పాత వారిని పక్కన పెట్టి కొత్తవారికి ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట.
ఈసారి ఎలాగానైనా 100 పైగా స్థానాలు కైవసం చేసుకోవాలని భావితున్న గులాభి బాస్.
సేఫ్ గేమ్ ఆడకుండా కొత్త వారిని బరిలో దించి రిస్క్ చేస్తున్నదనేది కొందరి ఆలోచన మరి.
ఈసారి తెలంగాణ ప్రజలు కేసిఆర్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో చూడాలి.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్17, ఆదివారం 2024