రాజన్న సిరిసిల్ల లో పర్యటించనున్న కేసీఆర్..!

తెలంగాణా సీఎం కే.సి.

ఆర్ ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటించనున్నారు.సీఎం రాక సందర్భంగా జిల్లా మొత్తం అధికారుల ఆధీనంలో తీసుకున్నారు.

మంత్రి కే.టి.

ఆర్ దగ్గర ఉండి ఈ కార్యక్రమాలు చూసుకున్నట్టు తెలుస్తుంది.ఈ పర్యటనలో భాగంగా 210 కోట్ల రూ.

లు విలువ గల అభివృద్ధి కార్యక్రమాలను సీఎం కే.సి.

ఆర్ ప్రారంభించనున్నారని సమాచారం.జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రకటించినట్టుగా కే.

సి.ఆర్ జిల్లా పర్యటన జరుగనుంది.

వరంగల్, యాదాద్రి, కామారెడ్డి జిల్లాల్లో కే.సి.

ఆర్ పర్యటించారు.రేపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా సీఎం కే.సి.

ఆర్ సరికొత్త భవనాలు ప్రారంభించబోతున్నరని తెలుస్తుంది.రెండు పడకల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు.

35 ఎకరాల విస్తీర్ణంలో 83 కోట్ల రూ.ల వ్యయంతో మెడపల్లి గ్రామంలో నిర్మించిన 1320 ఇళ్లను లబ్ధిదారులకు అందించనున్నారు.

ఆ తర్వాత నర్సింగ్ విద్యార్ధుల కోసం ఏర్పరచిన భవనం కూడా ప్రారంభించనున్నారని తెలుస్తుంది.

ఉచిత విద్యతో పాటుగా ఉపాధి శిక్షణ ఇచ్చే విధంగా అంతర్జాతీయ పాఠశాలను నిర్మించారు.

వీటన్నిటిని సీఎం కే.సి.

ఆర్ ప్రారంభించనున్నారు. ఇవే కాకుండా ఇంకా ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను సీఎం కే.

సి.ఆర్ ఈ పర్యటనలో ప్రారంభించనున్నారు.

 వ్యవసాయ క్షేత్రాల పర్యవేక్షణతో పాటుగా అధికారుల పనితీరుని కూడా ఈ పర్యటన ద్వారా తెలుసుకుంటారని తెలుస్తుంది.

నేడు ఏపీ లో ప్రధాని మోదీ ఎన్నికల టూర్ .. షెడ్యూల్ ఇదే