కెసీఆర్ వ్యూహంలో చిక్కుకుంటున్న ప్రతిపక్షాలు.. ఎలాగంటే

తెలంగాణ రాజకీయాలు మునుపెన్నడూ లేనంతగా రోజురోజుకు సంచలన కథనాలతో ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి ఉంది.

వచ్చే రెండున్నారేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇప్పటి నుండే అనధికారికంగా ఎన్నికల వాతావరణం అనేది తెలంగాణ రాజకీయాల్లో మొదలైందని చెప్పవచ్చు.

ఎందుకంటే ఇటు వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న క్రమంలో బీజేపీ మరింత దూకుడుగా ముందుకెళ్తోంది.

బీజేపీ ఎంత దూకుడుగా ముందుకెళ్తున్నా కెసీఆర్ మాత్రం కేవలం పాలనపై దృష్టి పెడుతూ వచ్చే ఎన్నికల్లో ముచ్చటగా మూడో సారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.

అయితే ఇటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కెసీఆర్ ను ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా విమర్శల వర్షం కురిపిస్తూ రాజకీయంగా బలపడాలనే వ్యూహంతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.

అయితే ఇక్కడే ప్రతిపక్షాలు కెసీఆర్ వ్యూహంలో చిక్కుకుపోతున్న పరిస్థితి ఉంది. """/"/ గత ఎన్నికల్లో కూడా ఇలాగే ప్రతిపక్షాలు అంతా ఒక్కటై కెసీఆర్ ను ఓడించాలన్న ప్రధాన లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగినా కెసీఆర్ ను ఒక్కరిగా చేసి అందరూ కెసీఆర్ ను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారన్న ఒక ప్రచారం ప్రజల్లోకి పెద్ద ఎత్తున బలంగా వెళ్లడంతో కెసీఆర్ మరింత గొప్ప మెజారిటీతో రెండవ సారి కూడా అధికారం చేపట్టిన విషయం తెలిసిందే.

అయితే వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేసే విధంగా అంతేకాక ఈ విషయంలో ప్రతిపక్షాలకు కోలుకోలేని దెబ్బ వేసే విధంగా కెసీఆర్ బలమైన వ్యూహరచన రచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ప్రజల్లోకి కెసీఆర్ పాలనతో వెళ్తుంటే అక్కడ కెసీఆర్ పై చేస్తున్న విమర్శలు బలంగా వెళ్ళడం లేని పరిస్థితి ఉంది.

ఇదే తరహా వాతావరణాన్ని కొనసాగిస్తూ ప్రతిపక్షాలను డిఫెన్స్ లో పడేయాలన్న కెసీఆర్ వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందనేది చూడాల్సి ఉంది.

రేపే నామినేషన్‎కి ఆఖరి రోజు.. ఖమ్మం ఎంపీ స్థానంపై సర్వత్రా ఉత్కంఠ