కేంద్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైర్

దేశంలో కేంద్రం ఆగడాలు పరాకాష్టకు చేరుకున్నాయని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ముప్పుతిప్పలు పెడుతోందని మండిపడ్డారు.

బీజేపీయేతర ప్రభుత్వాలను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని కేసీఆర్ ఆరోపించారు.ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు తిరస్కరించారని చెప్పారు.

ఢిల్లీలో పాలనాధికారాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.కానీ కేంద్రానికి సుప్రీం తీర్పు అంటే కూడా లెక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశంలో ఇప్పటి పరిస్థితులను చూస్తుంటే గతంలో ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నాయని కేసీఆర్ వెల్లడించారు.

విశాల్ సినిమాకు భారీ షాకిచ్చిన తెలుగు ప్రేక్షకులు.. అక్కడే తప్పు జరిగిందా?