కేసీఆర్ పిలుపుతో టిఆర్ఎస్ ధర్నా..మోడీ దిష్టిబొమ్మ దహనం
TeluguStop.com
వరి ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుమేరకు తెలంగాణ రైతాంగం పోరుబాటపట్టింది.
సోమవారం టీఆర్‌ఎస్ మేడ్చల్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్ ఆధ్వర్యంలో గౌడవెళ్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మోడీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు.
ఈ సందర్భంగా మల్కాజిగిరి టీఆర్ఎస్ పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులకు అన్యాయం చేస్తుందన్నారు.
రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని తక్షణమే గద్దె దింపాలని పేర్కొన్నారు.
కారు బానెట్‌పై చిన్నారి కూర్చోబెట్టి రోడ్డుపై ఏకంగా..? (వీడియో)