మెగాస్టార్ కి ఫోన్ చేసి పరామర్శించిన సీఎం కేసీఆర్!

కరోనా థర్డ్ వేవ్ లో వైరస్ బారిన పడుతున్న సెలబ్రిటీల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు,దుల్కర్ సల్మాన్, మమ్ముట్టి, మంచు లక్ష్మి , త్రిష, విశ్వక్సేన్ తదితరులు కరోనా బారిన పడ్డారు.

వీరితో పాటు మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ కూడా ఈ జాబితాలో చేరిపోయారు.అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా సోకిందని జనవరి 26న సోషల్ మీడియా ద్వారా మెగాస్టార్ చిరంజీవి తెలియజేశారు.

ప్రస్తుతం తను హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని తగిన చికిత్స తీసుకుంటున్నానని తెలియజేశారు.

అంతేకాక తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు అనే విషయం తెలియగానే ఎంతో మంది సినీ హీరోలు సోషల్ మీడియా వేదికగా తొందరగా మెగాస్టార్ చిరంజీవి కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

"""/"/ ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ నాని అల్లు అర్జున్ వంటి హీరోలు మెగాస్టార్ చిరంజీవి తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి పరామర్శించారు.

ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు.త్వరగా కోలుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

కేజ్రీవాల్ హెల్త్ చెకప్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ