ఈనెల 5న తెలంగాణ కేబినెట్ భేటీ

ఈనెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది.హైదరాబాద్ ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది.

ఈనెల 6వ తేదీన శాసనసభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

కాగా, 2023-24 వార్షిక బడ్జెట్ ను 6న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే.

మరోవైపు తెలంగాణ కేబినెట్ సమావేశం అనంతరం కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్ కు వెళ్లనున్నారని సమాచారం.

ఏడు సినిమాలు ఫ్లాప్..లక్ష్మి నరసింహ నుంచి సింహ వరకు ఏం జరిగింది ?