14 ఏళ్లకే డిగ్రీ పూర్తి చేసిన తెలంగాణ బాలుడు..!

సాధారణంగా విద్యార్థినీవిద్యార్థులు డిగ్రీ పూర్తి చేయాలంటే కనీసం 21 సంవత్సరాలు పడుతున్న సంగతి తెలిసిందే.

చాలామంది సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడం వల్ల సంవత్సరాలకు సంవత్సరాలు గడుస్తున్నా డిగ్రీ పట్టాను అందుకోలేకపోతున్నారు.

కానీ తెలంగాణకు చెందిన ఒక బాలుడు మాత్రం 14 సంవత్సరాలకే డిగ్రీ పూర్తి చేశాడు.

దీంతో బాలుడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.పూర్తివివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లోని కాచిగూడకు చెందిన ఆగస్త్య జైస్వాల్‌ చిన్న వయస్సులోనే అద్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నాడు.

తొమ్మిది సంవత్సరాల వయస్సులోనే పదో తరగతి చదివి పాసైన అగస్త్య, 11 సంవత్సరాలకు ఇంటర్ పూర్తి చేశాడు.

ఇంటర్ పూర్తైన తరువాత నగరంలోని యూసఫ్ గూఢలో ఉన్న సెయింట్ మేరీ కాలేజీలో చేరిన అగస్త్య అక్కడ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంను ఎంచుకున్నాడు.

నెల రోజుల క్రితం అగస్త్య చివరి సంవత్సరం పరీక్షలు రాయగా తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది.

పరీక్ష ఫలితాల్లో అగస్త్య ఫస్ట్ క్లాస్ లో పాస్ కాగా బాలుడిని, బాలుడి తల్లిదండ్రులను అందరూ ప్రశంసిస్తున్నారు.

చదువుతో పాటు నేషనల్ లెవెల్ లో ఆగస్త్య టేబుల్ టెన్నీస్ గేమ్ లో సత్తా చాటుతున్నాడు.

తన తల్లిదండ్రులు చిన్న వయస్సు నుంచి ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఈ రికార్డ్ తాను సాధించగలిగానని ఆగస్త్య చెబుతున్నాడు.

విభిన్న రంగాల్లో సత్తా చాటడానికి తల్లిదండ్రులే గురువులుగా మారి కెరీర్ లో ఎదిగే విధంగా ప్రోత్సహిస్తున్నారని ఆగస్త్య తెలిపాడు.

ఆగస్త్య ఫస్ట్ క్లాస్ లో పాస్ కావడంతో అతని స్నేహితులు, బంధువులు అభినందనలు తెలుపుతున్నారు.

నెటిజన్లు ఆగస్త్య ప్రతిభను సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు.ఆగస్త్య జైస్వాల్ సోదరి నైనా జైస్వాల్ సైతం 13 సంవత్సరాలకే డిగ్రీ పూర్తి చేయడం గమనార్హం.

ఈమె కూడా జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణిస్తోంది.

బోండా ఉమ ఎన్నికల అఫిడవిట్ తప్పులతడక..: వెల్లంపల్లి