పవన్ పైనే తెలంగాణ బీజేపీ భారం ?

తెలంగాణలో తమ పార్టీ పరిస్థితి,  గెలుపు అవకాశాలపై బిజెపికి( BJP ) ఏ క్లారిటీ రావడం లేదు.

మొన్నటి వరకు పార్టీలో కీలకంగా పనిచేసిన నేతలు ఎంతోమంది ఎన్నికల సమయంలో ఇతర పార్టీలో చేరిపోవడం,  అనూహ్యంగా కాంగ్రెస్ బలోపేతం కావడం , ప్రధాన పోటీ అంతా బీఆర్ఎస్( BRS ) కాంగ్రెస్ మద్య అన్న ప్రచారం జనాల్లోకి వెళ్లిపోవడంతో బిజెపి  తీవ్ర నిరుత్సాహానికి గురవుతోంది.

తెలంగాణ బిజెపి నేతల్లో ఉత్సాహం పెంచేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు తరచుగా తెలంగాణలో పర్యటిస్తూ , పార్టీ నాయకుల్లో జోష్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు .

అయినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు.పార్టీ నుంచి ఒక్కో కీలక నాయకుడు బయటకు వెళ్ళిపోతూ,  తీవ్ర విమర్శలకు దిగుతున్నారు .

అసలు తెలంగాణ బిజెపిలో కీలకంగా వ్యవహరించి పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా చేయడంతో పాటు, బీఆర్ఎస్ పై తరుచుగా విమర్శలు చేస్తూ ఇరుకున పెడుతూ వచ్చిన తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు,  కరీంనగర్ ఎంపీ బండి సంజయ్( Bandi Sanjay ) ను తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి నుంచి తప్పించిన దగ్గర నుంచి ఆ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నట్టుగానే కనిపిస్తుంది.

"""/" / బండి సంజయ్ విషయంలో చేసిన తప్పును బిజెపి అధిష్టానం పెద్దగా పట్టించుకోవడం లేదు.

అయితే రాబోయే ఎన్నికల్లో బిజెపికి గడ్డు పరిస్థితి తప్పదనే సంకేతాలు , సర్వే రిపోర్టులు రావడంతో బిజెపి అలర్ట్ అయింది .

ఏపీలో తమతో పొత్తులో ఉన్న జనసేన( Janasena ) ను తెలంగాణ ఎన్నికల్లోను పొత్తు పెట్టుకునే విధంగా ఒప్పించారు.

ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తెలంగాణ వ్యాప్తంగా బిజెపి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు అంగీకారం తెలిపారట.

ఈ మేరకు బిజెపి రాజ్యసభ సభ్యుడు జాతీయ ఓబీసీ సెల్ చైర్మన్ డాక్టర్ కె లక్ష్మణ్( OBC Cell Chairman Dr K Laxman ) పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన ను కలుపుకొని వెళ్తామంటూ ప్రకటించారు.

తమ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.ఇప్పటికే తెలంగాణలో టిడిపి తాము ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉంటామని ప్రకటించింది .

"""/" / ఇక వైయస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించిన షర్మిల( Sharmila ) కూడా ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు.

కానీ జనసేన మాత్రమే ఇప్పటికీ తెలంగాణలో బిజెపి మద్దతుతో పోటీ చేస్తామని చెబుతోంది .

అయితే జనసేన ఎన్నికల్లో ఓడినా గెలిచినా పెద్దగా ప్రభావం ఉండదు కానీ,  బీజేపీకి ఆ విధమైన వెసులుబాటు లేదు.

కచ్చితంగా తెలంగాణ ఎన్నికల్లో గెలవకపోతే పార్టీ మరింత బలహీనం అవుతుంది.అందుకే ఏపీ లో మాత్రమే కార్యక్రమాలు చేస్తూ అక్కడ ఎన్నికలపైనే ఎక్కువ ఫోకస్ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తెలంగాణ బిజెపి భారం వేసింది.

పవన్ పర్యటనలు,  ఎన్నికల ప్రచారం ,తెలంగాణ బిజెపిపై జనాల్లోనూ ఆదరణ పెంచుతాయని ఆ పార్టీ అంచనా వేస్తోంది.

అందుకే ఎప్పుడూ లేనివిధంగా పవన్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ బిజెపి నేతలు ఆయన్ను ప్రసన్నం చేసుకునే పనుల్లో పడ్డారు.

తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో… మా ప్రేమ పెరుగుతోంది అంటూ?