కిషన్ రెడ్డి కుర్చీ సేఫ్ ! బీజేపీ పెద్దల లెక్క ఇదే 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ( BJP ) ఘోరంగా ఓటమి చెందడాన్ని ఆ పార్టీ నాయకులు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.

ముఖ్యంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ , కాంగ్రెస్ లకు ధీటుగా సీట్లను సాధిస్తామని నమ్మకంతో  ఉంటూ వచ్చింది.

111 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా,  కేవలం 8 స్థానాల్లో మాత్రమే బిజెపి అభ్యర్థులు గెలుపొందడం,  ఆ పార్టీ పెద్దలను తీవ్ర నిరాశ పరిచింది.

దీంతో తెలంగాణ బీజేపి అధ్యక్ష బాధ్యతలు నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తప్పించి,  కొత్త వారికి అవకాశం ఇస్తారనే ప్రచారం జరిగింది.

దీనికి తగ్గట్లుగానే కిషన్ రెడ్డి కూడా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలనే ఆలోచనతో ఉన్నారు.

దీంతో  వచ్చే ఎన్నికల్లో తన నియోజకవర్గం దృష్టి సారించాలని కిషన్ రెడ్డి ( Kishan Reddy )భావిస్తున్నారు.

కిషన్ రెడ్డి స్థానంలో కొత్తవారికి అప్పగిస్తారనే హడావుడి జరిగింది.  అయితే కేంద్ర బీజేపీ పెద్దలు మాత్రం ఈ విషయంలో ఆలోచనలో పడ్డారట.

మరికొద్ది నెలలోనే పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కిషన్ రెడ్డిని తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తే లేనిపోని తలనొప్పులు వస్తాయని,  అందుకే పార్లమెంటు ఎన్నికల్లో ముగిసే వరకు కిషన్ రెడ్డిని కొనసాగిస్తే మంచిదనే అభిప్రాయానికి వచ్చారట.

"""/" / 2019 పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లను బిజెపి గెల్చుకుంది.

ఈసారి మాత్రం మెజార్టీ సీట్లను గెలుచుకోవాలనే వ్యూహంతో ఉంది.తెలంగాణ బిజెపి అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగానూ కొనసాగుతున్నారు.

దీంతోపాటు తెలంగాణ  బిజెపి అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తున్న  నేపథ్యంలో.  కేంద్రం తెలంగాణకు ఇప్పటివరకు కేటాయించిన నిధులు,  అభివృద్ధి వంటి అన్ని విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కిషన్ రెడ్డిని ఉపయోగించుకోవాలని అధిష్టానం భావిస్తోంది .

కేంద్రం తెలంగాణ( Telangana )కు కేటాయించిన రీజనల్ రింగ్ రోడ్లు,  రైల్వే, రోడ్ల అభివృద్ధిని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది .

ఈనెల 16 నుంచి వచ్చే నెల 15 వరకు వికాసిత్ భారత్ సంకల్పయాత్ర పేరుతో జనాల్లోకి వెళ్లే విధంగా ప్లాన్ చేశారు.

"""/" /  దీంతోపాటు తెలంగాణ బిజెపి నేతల మధ్య ఉన్న గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టేందుకు అధిష్టానం కిషన్ రెడ్డిని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం .

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాల దృష్టి బీసీలకు ఎక్కువ కేటాయింపు సూత్రాన్ని పక్కనపెట్టి,  గెలిచే అవకాశం ఉన్నవారికి టికెట్లు ఇవ్వాలని బిజెపి నిర్ణయించుకుందట .

ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలపై పార్లమెంట్ సమావేశాలు తర్వాత రాష్ట్ర స్థాయిలో సమీక్ష నిర్వహించాలని బిజెపి పెద్దలు నిర్ణయించుకున్నారట.

బన్నీ నేషనల్ అవార్డ్ రద్దు చేయాల్సిన అవసరం ఉందా.. అలా చేయడం సాధ్యమేనా?