సినిమా వాళ్ళని పక్కన పెట్టిన తెలంగాణ బీజేపీ..కారణం..?

తెలంగాణలో బిజెపి (BJP) అధినాయకత్వం తీసుకునే ఆలోచనలు ఎవరికి అంతు పట్టడం లేదు.

ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ కి ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తుంది అని భావించిన బిజెపి పార్టీ రోజురోజుకి దిగజారి పోతుంది.

ఒక్కొక్కరిగా పార్టీకి రాజీనామాలు చేసి ఇతర పార్టీలలోకి జంప్ అవుతున్నారు.ఇక పార్టీ అధ్యక్షుడి ని మార్చినప్పటి నుండి పార్టీలో అంత ఊపు లేదు.

అలాగే బండి సంజయ్ కూడా పార్టీని ఎక్కువగా పట్టించుకోవడం లేదని బండి సంజయ్(Bandi Sanjay) కి ఈటెల రాజేందర్ కి మధ్య పోసగడం లేదని, ఈటెల రాజేందర్ వచ్చినప్పటి నుండి పార్టీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది అనే టాక్ బీజేపీ కార్యకర్తల్లో ఉంది.

అయితే బీజేపీ మొదటి నుండి సినిమా వాళ్లకి చాలా ప్రియారిటీ ఇస్తుంది.అలా ఇప్పటికే ఎంతోమంది సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు.

జయప్రద(Jayaprada), సౌందర్య వంటి నటీమణులు బిజెపిలో ఉన్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ ఎన్నికలకు ముందే సీనియర్ నటి జయసుధ( Jayasudha ) కూడా బీజేపీ పార్టీ కండువా కప్పుకుంది.

అలాగే విజయశాంతి,( Vijayashanti ) బాబు మోహన్( Babu Mohan ) వంటి వాళ్లు కూడా పార్టీలో ఉన్నారు.

ఇక వీళ్లే కాకుండా జూనియర్ నటీమణులైన మాధవి లత, రేష్మ వంటి హీరోయిన్లు కూడా బిజెపిలో కొనసాగుతున్నారు.

"""/" / అయితే వీరందరూ తమకి ఈ ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్లు ఇస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ వీరిలో ఏ ఒక్కరికి కూడా బిజెపి అధిష్టానం అసెంబ్లీ టికెట్ కేటాయించలేదు.

ఇక బాబు మోహన్ మాత్రం నేను పోటీ చేయను అని ఎంత మొత్తుకున్నా కూడా ఆయనకు ఆందోల్ టికెట్ ని కేటాయించారు.

కానీ టికెట్ వస్తుందని ఎంతగానో ఎదురు చూసిన విజయశాంతి (Vijayashanti), జయసుధ వంటి వాళ్లకు మాత్రం బీజేపీ అధిష్టానం మొండి చేయి చూపింది.

దీంతో చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం బిజెపి పార్టీ మొదటి నుండి సెలబ్రిటీలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు.

"""/" / అలాంటిది తెలంగాణ బిజెపి అధినాయకత్వం మాత్రం సెలబ్రిటీలను ఎందుకు దూరం పెట్టింది అని చర్చించుకుంటున్నారు.

అంతేకాదు ఇప్పటికే విజయశాంతి బీజేపీ పార్టీపై అసంతృప్తితో కాంగ్రెస్ (Congress) లోకి వెళ్లే యోచన లో ఉన్నట్టు సమాచారం అందుతుంది.

ఏది ఏమైనాప్పటికీ సినిమాల్లో రాణించి రాజకీయాల్లో సైతం చక్రం తిప్పాలనుకుని నేషనల్ పార్టీ అయినా బిజెపిలోకి వెళ్తే ఈ సెలబ్రిటీ లందరికీ తెలంగాణ బిజెపి అధినాయకత్వం నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు.

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. 18 మంది మృతి