తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ భారీ స్కెచ్..

బీజేపీ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర లక్ష్యం నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నాయి.

గత నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉమ్మడి పాలమూరులోని జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం జోగులాంబ నుంచి ప్రారంభమైన పాదయాత్ర మే నెల 10వ తేదీ వరకు పాలమూరు జిల్లాలో కొనసాగింది.

క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా చూసి ప్రభుత్వం కళ్లు తెరిపించాలనే లక్ష్యంగా చేపట్టిన ఈ పాదయాత్ర అనుకున్న లక్ష్యాన్ని సాధించిందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్నారు.

టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఎలాంటిసమస్యలు లేవని, దేశంలో గర్వించే స్థాయికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పిన టీఆర్ఎస్ మాటలను ప్రజలు ఎంత వరకు విశ్వసిస్తున్నారనే వాస్తవాలను తెలుసుకునేందుకే ఈ పాదయాత్ర చేపట్టినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.

అయితే జోగులాంబ నుంచి ప్రారంభమైన యాత్ర ఉమ్మడిపాలమూరు జిల్లాలోని గద్వాల, మక్తల్, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల మీదుగా మూడు వందల ఇరవై కిలోమీటర్ల దూరాన్ని ఇరవై ఏడు రోజుల్లో పూర్తి చేశారు.

దారిపొడుగునా ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి గ్రామ గ్రామానికి ఆహ్వానించారు.గ్రామ కూడళ్లలో తమ పాదయాత్ర వాహనంపై నుంచి ప్రజలను ఉత్తేజపరుస్తూ, టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు.

మాటిమాటికి కేంద్ర ప్రభుత్వం పై దుమ్మెత్తి పోసే నేతలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పాలని, కేంద్రం సహకారం లేనిదే రాష్ట్రంలో ఇంతలా అభివృద్ధి జరిగేదా? అనే విషయంలో ప్రజల్ని జాగృత పరచడంలో బీజేపీ నేతలు కొంతవరకు సఫలీకృతులయ్యారు.

స్థానిక సమస్యలే ప్రధాన ఎజెండాగా మలచుకుని స్థానిక సమస్యలపై గళమెత్తారు. """/"/ మహబూబ్ నగర్లో స్థానిక మంత్రి శ్రీనివాస్ గౌడ్ అరాచకాలు, భూకబ్జాలు గురించి ప్రసంగిస్తూ హుషారెత్తించారు.

నారాయణపేట సభలో 69 జీఓను అమలు చేయక పోవడం మూలంగా నారాయణపేట, మక్తల్, కొడంగల్ జిల్లాలకు సాగునీరు, తాగునీరులేక ఇబ్బందులు తలెత్తాయన్నారు.

అలంపూర్, గద్వాల సమావేశాల్లో నేతలు ఆర్డీఎస్ ప్రాజెక్టును ప్రధానంగా తీసుకొని టీఆర్ఎస్ నేతల అసమర్థతపై ప్రశ్నల వర్షం కురిపించారు.

జడ్చర్ల సమావేశంలోస్థానిక నేతలు భూ అక్రమ దందాలకు తెరలేపారని, వారిని అడ్డుకోవాలంటే టీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు.

"""/"/ స్థానిక టీఆర్ఎస్ నాయకులు ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన సంఘటనలను బాధితుల ద్వారా తెలుసుకొని వారి అరాచకాలను ఎండగట్టారు.

ప్రజలకు బీజేపీ పై నమ్మకం ఏర్పడిందనే దిశగా నేతలు అభిప్రాయపడుతున్నారు.అదేవిధంగా దారి పొడుగునా అనేక కుల సంఘాలతో సమావేశాలు, దివ్యాంగులు, చేనేత కార్మికులతో, ఉపాధి కూలీ కార్మికులతో సమావేశాలు అవుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ తీరుస్తామని హామీలు ఇస్తూ ముందుకు సాగారు.

వ్యవసాయ పనులు చేస్తున్న రైతన్నల వద్దకు, కూలీ పనులు చేస్తున్న మహిళల వద్దకు, ప్రజా సంగ్రామ యాత్ర రథసారథి బండి సంజయ్ కుమార్ వెళ్లి కలవడం వారిలో భరోసా కల్పించారని బీజేపీ నాయకులు భావిస్తున్నారు.

"""/"/ జిల్లాలోని 7 నియోజకవర్గాలైన అలంపూర్, గద్వాల, మక్తల్, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్లలో చేపట్టిన బహిరంగ సభలో ప్రజలుఆశించిన మేరకు హాజరు కావడం బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

వీటితో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, విజయశాంతి, బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ తదితరులు జిల్లాలో ప్రజలు, కుల సంఘ నాయకులతో మాట్లాడి పాదయాత్ర దిగ్విజయం కావడానికి దారులు ఏర్పరచారు.

ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టి ఎన్నికల్లో పోటీ చేసి అఖండ విజయం సాధించిన మాదిరిగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర అంతటి విజయాన్ని సాధిస్తుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

విజయవాడ లో పసుపుజాతర