ఢిల్లీ బాట పట్టిన తెలంగాణ బీజేపీ ఎంపీలు..!!

లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన తెలంగాణ బీజేపీ ఎంపీలు హస్తిన బాట పట్టారు.

ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ ఢిల్లీలో ఉన్నారు.తాజాగా బీజేపీ నేతలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, నగేశ్( DK Aruna, Konda Visveswara Reddy, Etala Rajender, Raghunandan Rao, Nagesh ) మరియు ధర్మపురి అరవింద్ ఢిల్లీకి వెళ్లారు.

కాగా రేపు ఉదయం 11 గంటలకు ఢిల్లీలో బీజేపీ ఎంపీల సమావేశానికి నేతలు హాజరుకానున్నారు.

అనంతరం ఎన్డీఏ పక్ష ఎంపీల సమావేశానికి తెలంగాణ బీజేపీ ఎంపీలు హాజరు కానున్నారు.

అయితే ఎన్డీఏ పక్షనేతగా నరేంద్ర మోదీని బీజేపీ మిత్రపక్ష ఎంపీలంతా కలిసి ఎన్నుకోనున్నారన్న సంగతి తెలిసిందే.

రెబల్స్ చేతుల్లోకి పాలన .. సిరియా నుంచి 75 మంది భారతీయుల తరలింపు