స్పీడ్ పెంచిన బీజేపీ ! ఆపరేషన్ ఆకర్ష్ పైనే ఫోకస్ ? 

తెలంగాణలో బిజెపి స్పీడ్ పెంచింది.2023 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యంగా పావులు కదుపుతోంది.

దీని కోసం ఏం చేయాలనే విషయంపై తెలంగాణ బిజెపి నేతలు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు.

దీనికి తోడు పార్టీ అధిష్టానాన్ని సైతం తెలంగాణ బిజెపి నాయకులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం తో పాటు,  ఎక్కువగా ఫోకస్ పెంచాలని సూచించడంతో తెలంగాణ బిజెపి నాయకులు మరింతగా ఫోకస్ పెంచారు.

టిఆర్ఎస్ , కాంగ్రెస్ లోని అసంతృప్త నాయకులను గుర్తించి వారిని పార్టీలో చేర్చుకునే విషయం పైనే ఎక్కువగా ఫోకస్ చేశారు .

అలాగే చిన్న చిన్న పార్టీలు సైతం బిజెపిలో విలీనం చేసుకుని మరింతగా బలపడాలనే లక్ష్యంతో తెలంగాణ బిజెపి నాయకులు ఉన్నారు.

దీనికోసం నియోజకవర్గంలో ప్రభావం చూపించగలిగిన బలమైన నాయకులు పైన ఫోకస్ పెంచారు.     అలాగే టిఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించి అసంతృప్తితో ఉన్న వారిని బిజెపి చేర్చుకునే విషయంలో సక్సెస్ అయ్యారు.

ఉద్యమ నేపథ్యం ఉన్న స్వామిగౌడ్,  రవీందర్ నాయక్ , ఈటల రాజేందర్ ఇలా ఎంతో మంది నాయకులు బిజెపిలో చేరి పోయారు.

వీరితో పాటు విఠల్ సైతం బీజేపీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.ఉద్యమ నేపథ్యం ఉన్న వారిని చేర్చుకోవడం ద్వారా జనాల్లో ను బిజెపికి మంచి గుర్తింపు వస్తుందని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.

ఒకపక్క నాయకులను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా , చిన్నచిన్న పార్టీలను  విలీనం చేసుకుంటూ తమ ప్రధాన ప్రత్యర్థి టిఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టేలా తెలంగాణ బిజెపి నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు.

తాజాగా యువ తెలంగాణ పార్టీని విలీనం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.    """/"/    ఈ మేరకు ఆ పార్టీ నేతలు జిట్టా బాలకృష్ణ,  రాణిరుద్రమ తో మంతనాలు పూర్తి చేశారు.

అయితే ఈ సందర్భంగా వారు కొన్ని షరతులు కూడా విధించారట.జిట్ట బాలకృష్ణకు భువనగిరి అసెంబ్లీ,  లేదా పార్లమెంటు సీటు ఇవ్వాలని,  అలాగే రాణి రుద్రమ కు వరంగల్ జిల్లాలో ఒక స్థానాన్ని ఇచ్చే విధంగా చర్చలు జరిగినట్లు సమాచారం.

అలాగే ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన మరో పార్టీని విలీనం చేసుకునేందుకు తెలంగాణ బిజెపి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారట.

ఏది ఏమైనా 2023 ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ బిజెపి నాయకులు పట్టుదలతో ఉన్నారు.

ఇక పార్టీ అధిష్టానం కూడా దీనిపైనే స్పెషల్ గా దృష్టి సాధించడం తెలంగాణ బిజెపి నాయకులకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది.

 .

Lemon Crop : నిమ్మ తోటల్లో పూత నియంత్రణ యాజమాన్యంలో పాటించాల్సిన సరైన మెళుకువలు..!