BJP : రేపటి నుంచి తెలంగాణ బీజేపీ బస్సు యాత్రలు..!!

త్వరలో లోక్‎సభ ఎన్నికలు( Lok Sabha Elections ) రానున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ( BJP ) సిద్ధం అవుతోంది.

ఈ మేరకు రేపటి నుంచి రాష్ట్ర బీజేపీ బస్సు యాత్రలు నిర్వహించనుంది.మార్చి ఒకటి వరకు కొనసాగనున్న ఈ బస్సు యాత్రలకు విజయసంకల్ప యాత్రలుగా నామకరణం చేశారు.

ఈ నేపథ్యంలో ముందుగా హైదరాబాద్ లోని ఛార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) పూజలు నిర్వహించనున్నారు.

"""/" / అనంతరం విజయసంకల్ప యాత్ర ప్రచార రథాలను ఆయన ప్రారంభించనున్నారు.

కాగా రాష్ట్రంలోని మొత్తం ఐదు క్లస్టర్లలో బీజేపీ ఒకేసారి బస్సు యాత్రలను ప్రారంభించనుంది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు అస్సాం, గోవా ముఖ్యమంత్రులతో పాటు కేంద్రమంత్రి పాల్గొననున్నారు.

ఈ ఇయర్ లో భారీ విజయాలను సాదించిన టాప్ 3 ఇండియన్ సినిమాలు ఇవేనా..?