తెలంగాణ బీజేపీ నూతన కార్యవర్గ ప్రకటన..!
TeluguStop.com
తెలంగాణ రాష్ట్ర బీజేపీకి కొత్త రూపు వచ్చింది.బీజేపీ తెలంగాణ నూతన కమిటీని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు.
పాత, కొత్త కలయికతో 23 మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు.కొన్ని నెలల కిందట రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ పూర్తి కార్యవర్గాన్ని అదివారం వెల్లడించారు.
ఈ నూతన కమిటీలో 8 మంది ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, 8 మంది కార్యదర్శులు, ఇద్దరు ట్రెజరర్స్, కార్యక్రమ కార్యదర్శితో కమిటీని ఏర్పాటు చేశారు.
రాష్ట్ర కమిటీతో పాటు పార్టి అనుబంధ మోర్చాలకు అధ్యక్షులను బండి సంజయ్ ప్రకటించారు.
బీజేపీ రాష్ట్ర కమిటీలో ఆరుగురు మహిళలకు చోటు కల్పించారు. """/"/
జి.
విజయరామారావు, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బండారు శోభారాణి, సంకినేని వెంకటేశ్వరరావు, ఎండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి.
మోహన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి, శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శులుగా నియమితులయ్యారు.
రఘునందన్ రావు, కుంజా సత్యవతి, పల్లె గంగారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రకాశ్ రెడ్డి, బొమ్మ జయశ్రీ, మాధవి, ఉమారాణి కార్యదర్శులుగా నియమించారు.
బండారి శాంతి కుమార్ కోశాధికారిగా నియమితులయ్యారు.రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు నూతన కమిటీ కృషి చేయాలని బండి సంజయ్ కోరారు.
మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?