తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర.. రూట్ మ్యాప్ ఇదే..!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బంది సంజయ్ పాదయాత్ర చేయదలచిన విషయం తెలిసిందే.తెలంగాణ మొత్తం పాదయాత్ర చెసేలా ప్రణాళిక రూపొందించారు.

ఆగష్టు 9 చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం నుండి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం కానుంది.

వైఎస్సార్ పాదయాత్ర దారిలోనే బండి సంజయ్ పాదయాత్ర సాగనుంది.మొదట విడతగా రంగారెడ్డి, మెద్క్, నిజామాబాద్, కరీం నగర్ జిల్లాల్లో పాదయాత్ర ఉంటుంది.

నాలుగైదు విడతల్లొ తెలంగాణా మొత్తం బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు.మొదటి విడతలో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన ఆగష్టు 9న మొదలు పెట్టి గాంధి జయంతి అక్టోనర్ 2న్ ముగిస్తారని తెలుస్తుంది.

ఈ పాదయాత్ర రెండున్నర ఏళ్లు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు.మొదటి విడతలో 55 రోజుల పాటు 750 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు.

రోజుకి 15 నుండి 20 కిలోమీటర్ల వరకు బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు.

పాతబస్తీ, ఆర్య మైసమ్మ, ముయినాబాద్, చేవెళ్ల, వికారాబాద్ మీదుగా పాదయాత్ర చేస్తారని తెలుస్తుంది.

మొదట విడత పాదయాత్రని హుజూరాబాద్ లో ముగించనున్నారు.తెలంగాణా వ్యాప్తంగా బండి సంజయ్ పాదయాత్ర ఉంటుంది.

ప్రణాళిక ప్రకారం విడతల వారీగా ఈ యాత్ర కొనసాగుతుంది.అన్ని జిల్లాలను కవర్ చేయాలని బండి సంజయ్ నిర్ణయించుకున్నారు.

శోభితతో పెళ్లి జీవితం గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. అలా చెప్పడంతో?