టి.అసెంబ్లీ రద్దు సరే .. ఆ తరువాత పరిస్థితి ఏంటి ..

టీఆరఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి సంచలన నిర్ణయానికి పాల్పడ్డాడు.అయితే కేసీఆర్ నిర్ణయంపై ఇప్పటికే పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

కేసీఆర్ అనవసరంగా తొందరపడ్డాని ఇంకా తొమ్మిదినెలపాటు అధికారం అనుభవిచే అవకాశం ఉండగా అసెంబ్లీని రద్దు చేసి దిద్దుకోలేని తప్పు చేసాడని పార్టీలో చర్చ జరుగుతుండగా మరికొంతమంది మాత్రం కేసీఆర్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.

అసెంబ్లీ రద్దవుతుందని నెల నుంచి ప్రచారం జరుగుతుంది.ముందస్తు ఎన్నికలకు వెళతారని అందరూ ఊహించినిదే.

కాని అసెంబ్లీ రద్దయిన గంటలోనే అభ్యర్థులను ప్రకటించడం మాత్రం నిజంగా సాహసమే.

గతంలో ఎన్నడూ ఎవరూ ఇలా ప్రకటించలేదు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ కేసీఆర్ తన నిర్ణయాన్ని ప్రకటించే ముందుగా పదిహేను సార్లు సర్వేలు నిర్వహించినట్లు స్వయంగా ఆయనే చెప్పారు.

సర్వే నివేదికల ప్రకారం తాను టిక్కెట్లు కేటాయిన్చడం, అసెంబ్లీ రద్దు చేయుంచడం అన్ని చకచకా జరిగాయని చెప్తున్నాడు.

తెలంగాణాలో ఇప్పుడిప్పుడే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ప్రజల్లోకి వెళుతున్నాయని, రైతు పెట్టుబడి పథకం కూడా ఇప్పుడిప్పుడే గ్రామస్థాయిలో ప్రచారం ఊపందుకుంది.

అలాగే రైతు బీమా పథకం కూడా ఇంకా గ్రామాలకు వెళ్లలేదు.మిషన్ భగీరధ పథకం కింద గ్రామాలకు నీళ్లు చేరలేదు.

మిషన్ కాకతీయ పరిస్థితి కూడా అంతే.ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లారంటే అయన ధైర్యం ఏంటో అర్ధం కావడంలేదని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

వాస్తవానికి ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ వ్యూహం బాగుందని, ఆయన హవా జోరు పెరిగిందని, అందుకే ఆయన వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నార ని టీఆర్ ఎస్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.

అయితే, నిజంగా గెలిచే సత్తా ఉన్నప్పుడు ఇప్పటికిప్పుడు ఎందుకు నిర్ణయం తీసుకోవడం? అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ కేసీఆర్ టికెట్ కేటాయింపులు బాగానే ఉన్నా.ఇటీవల కొంగరకలాన్ లో జరిగిన ప్రగతి నివేదన సభలో ఆశావహులు తమ శక్తివంచన లేకుండా జనసమీకరణ చేశారు.

అయితే వారి ఆశలన్నీ గల్లంతయ్యాయి.ఇప్పుడు వారు ఇతర పార్టీలవైపు ఖచ్చితంగా చూస్తారంటున్నారు.

అభ్యర్థులు కొత్త వారైతే ముందుగా ప్రకటించినా వారు జనంలోకి వెళ్లి ఎన్నికల సమయానికి పరిచయం అవుతారు.

అయితే అందరూ పాత అభ్యర్థులే కావడం వారిలో ఎక్కువ మందిపై వ్యతిరేకత ఉండటం టీఆర్ఎస్ కి ఏ మేరకు కలిసి వస్తుందో తెలియడంలేదు.

నియోజకవర్గ స్థాయిలో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి నడిపించన ఉద్యమకారులు, టికెట్ హామీతో పార్టీలో చేరిన కొంతమందికి ఇప్పుడు టిక్కెట్లు దక్కకపోవడంతో వారు అభ్యర్థులకు సహకరించే అవకాశం లేకపోగా, ఇతర పార్టీల వైపు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇవన్నీ కేసీఆర్ ఎలా పరిష్కరించుకుని ముందుకు వేళ్తాడో చూడాలి.

వైశాఖ మాసం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..?